Hyderabad: సినిమాను తలపించే సీన్.. నిమిషం నిమిషానికి ట్రాకింగ్.. టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న ఫ్లైట్‌లో

పోలీసులు ఓ కంత్రీ దొంగకు చెక్ పెట్టారు. ఏకంగా టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న ఫ్లైట్‌లో అతని చేతికి బేడీలు వేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది.

Hyderabad: సినిమాను తలపించే సీన్.. నిమిషం నిమిషానికి ట్రాకింగ్.. టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న ఫ్లైట్‌లో
Chain Snatcher Arrest
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2022 | 8:44 PM

Chain Snatcher Arrest: ఈజీగా మనీ సంపాదించడానికి షార్ట్ కట్‌గా చోరీలను ప్లాన్ చేస్తున్నారు కొందరు. మరికొందరు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే టెక్నాలజీ అప్పట్లా లేదు. కాప్స్ కూడా అప్‌‌‌‌డేట్ అయ్యారు. గంటల వ్యవధిలో నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​(Hyderabad) శివారులోని అబ్దుల్లాపూర్​మెట్(Abdullahpurmet)​ పీఎస్​ పరిధిలో  మార్చి 29న ఓ చైన్ స్నాచింగ్  జరిగింది. కమల అనే మహిళ మెడలో నుంచి గోల్డ్ చెయిన్ లాక్కెల్లాడు ఓ కంత్రీ దొంగ. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో కమలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, ఇతర టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో సినిమా లెవల్‌లో పోలీసులు నిందితుడిని వెంటాడారు. అతడిది యూపీగా గుర్తించి.. ఆ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఢిల్లీ(Delhi) చెక్కేయాలని అతడి ప్లాన్‌ను భగ్నం చేశారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసులను అలెర్ట్ చేశారు. మార్చి 30న ఉదయం ఉదయం 5 గంటలకు సమాచారం అందుకున్న ఔట్​పోస్ట్​ పోలీసులు.. శంషాబాద్​ ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బందితో కలిసి అంతా వెతికారు. చివరికి.. ఢిల్లీ వెళ్లే జెట్​ఎయిర్​వేస్​ విమానంలో నిందితుడు ఉన్నట్టు గుర్తించారు. రన్​వేపై ఉన్న విమానం దగ్గరికి వెళ్లి.. నిందితున్ని అదుపులోకి తీసుకుని రాచకొండ పోలీసులకు అప్పజెప్పారు. అతడి దగ్గర ఉన్న నాలుగు తులాల గోల్డ్ చైన్ రికవర్  చేసుకున్నారు.

యూపీకి చెందిన హేమంత్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. చైన్ స్నాచింగ్ విషయంలో ఆరితేరాడు. హేమంత్​పై ఇప్పటివరకు మొత్తం ఆరు కేసులున్నాయి. చైన్ స్నాచింగ్‌లు చేసేందుకు హేమంత్​.. విమానాల్లోనే రాకపోకలు కొనసాగిస్తుంటాడని పోలీసులు విచారణలో కనుగొన్నారు.

Also Read: Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు

పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..