Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు
పెట్రో ధరల మంటతో చాలామంది ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. వందదాటింది పెట్రోల్ ఏం చేస్తారు చెప్పండి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారు సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చింది.
పెట్రో ధరలు(Fuel Prices) మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఘటనలు ఈ వాహనాలు వినియోగంపై భయాన్ని పురిగొల్పుతున్నాయి. ఇటీవల Ola ఎలక్ట్రిక్, Okinawa ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగి దగ్ధమైన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. తాజాగా ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నడిరోడ్డుపై మంటలు చెలరేగాయి. ఉత్తర చెన్నై(North Chennai) సమీపంలోని మంజంపాక్కం ప్రాంతంలోని మధుర టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమంత్ బెనర్జీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. 4 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు 4 రిపోర్ట్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఈ నేపథ్యంలో వేసవిలో ఉష్టోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Another one…Its spreading like a wild #Fire . After #Ola & #okinawa #electric scooter from #PureEV catches fire in Chennai. Thats the 4th incident in 4 days.. The heat is on.#ElectricVehicles #OLAFIRE #lithiumhttps://t.co/pFJFb7uKD7 pic.twitter.com/jJqWA48CNf
— Sumant Banerji (@sumantbanerji) March 29, 2022
కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు, వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తోంది. తాజా ఘటనల నేపథ్యంలో కేంద్రం అలెర్టయ్యింది. భద్రత, ఇతర ప్రమాణాల విషయంలో.. తాజా కేసులపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది.
Also Read: ఒంట్లో బాలేదంటూ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఆస్పతికి తీసుకువెళ్లగా పిడుగులాంటి వార్త