AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు

తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు
Traffic Challans
Balaraju Goud
|

Updated on: Mar 30, 2022 | 8:58 PM

Share

Traffic Challans Concession: తెలంగాణ(Telangana) వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్ల(Pending Challans)పై ఇచ్చిన రాయితీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ(Mohd. Mahamood Ali) తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు(KCR) గారి ఆదేశాల మేరకు పెండింగ్ చలాన్ల గడువు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు గానూ ఇప్పటి వరకు వాహనదారుల నుంచి స్పందన లభించిందన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరిందన్నారు.

ట్రాఫిక్ చలానాల రాయితీ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల చలాన్లు చెల్లింపు జరిగిందని హోంమంత్రి తెలిపారు. వీటి విలువ 840 కోట్ల రూపాయలని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు వ‌చ్చినందున ప్ర‌భుత్వం సానుకూలంగా పరిశీలించి మరో 15 రోజుల పాటు 15-04-2022) పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని వివరించారు. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంమంత్రి తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.

ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితీని నిర్ణయించారు.

  1. • టూవీలర్ / త్రీవీలర్- కట్టాల్సింది – 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ.
  2. •RTC డ్రైవర్స్ కట్టాల్సింది – 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ.
  3. •LMV/ HMV – కట్టాల్సింది – 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫీ.
  4. •తోపుడు బండ్ల వ్యాపారులు కట్టాల్సింది – 20%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ.
  5. •నో మాస్క్ కేసులు- కట్టాల్సింది – Rs.100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ.

బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్‌లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

Read Also….  Telangana: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. స్కూళ్ల పనివేళలు కుదింపు..