Ramzan 2022: ముస్లిం ఉద్యోగులకు శుభవార్త.. రంజాన్ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Ramzan 2022: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో వెసులుబాటు
Ramzan 2022: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు పని వేళల్లో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు గంట ముందు ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్ళేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్ ప్రకారం.. నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 లేదా 4 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఒక గంట ముందు ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ ప్రకటనను విడుదల చేసింది.
ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించింది. దీనికి ప్రతీగా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: