TS ICET 2022: తెలంగాణ ఐసెట్ 2022 నోటిఫికేషన్ విడుదల..ఈ తేదీల్లోనే పరీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాకయతీ యూనివర్సిటీ (Kakatiya University) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుంచి..
TS ICET Exam Dates 2022: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాకయతీ యూనివర్సిటీ (Kakatiya University) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెల్పింది. రూ.250ల ఆలస్య రుసుముతో జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుముతో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000ల ఆలస్య రుసుముతో జులై 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా జులై 27, 28 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తోంది.
తెలంగాణ ఐసెట్ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలుండాలి..
- మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు కనీసం 3 సంవత్సరాల వ్యవధి కలిగిన బ్యాచిలర్ డిగ్రీ (బీఏ/ బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీబీఎం/బీసీఏ/బీఈ/బీటెక్/ బీఫార్మసీ/ లేదా తత్సమాన కోర్సుల్లో (ఓరియంటల్ భాషల్లో డిగ్రీ మినహా) ఉత్తీర్ణులై ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశం పొందగోరే విద్యార్ధులు బీసీఏ/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ /బీఎస్సీ/బీకాం/మాథ్స్‌లో బీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: