IGNOU B.Ed Admissions 2022: ఇగ్నో 2022 జనవరి సెషన్‌ బీఎడ్‌ అడ్మిషన్లు షురూ! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) 2022 జనవరి సెషన్‌కు సంబంధించి బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను మే నెల్లో..

IGNOU B.Ed Admissions 2022: ఇగ్నో 2022 జనవరి సెషన్‌ బీఎడ్‌ అడ్మిషన్లు షురూ! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
Ignou
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 7:31 AM

IGNOU B.Ed Admission January 2022 session: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) 2022 జనవరి సెషన్‌కు సంబంధించి బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను మే 8, 2022 (ఆదివారం)న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 17. ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ కింది అర్హతలుండాలి.

బ్యాచిలర్ డిగ్రీ/ లేదా సైన్సెస్/సోషల్ సైన్సెస్/ కామర్స్/ హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 55 శాతం మార్కులతో సైన్స్, మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ లేదా తత్సమాన అర్హతలుండాలి. అభ్యర్థులు ఎలిమెంటరీ విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ టీచర్లను కలిగి ఉండాలి మరియు వారు ముఖాముఖి మోడ్ ద్వారా NCTE గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 శాతం మార్కుల రిజర్వేషన్ వర్తిస్తుంది. వీటితో పాటు ఇగ్నో సూచించిన ఇతర అర్హత ప్రమాణాలుండాలి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

Also Read:

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 నోటిఫికేషన్ విడుదల..ఈ తేదీల్లోనే పరీక్షలు..