Attention: మరికొన్ని గంటల్లో ముగియనున్న జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌! నేడే ఆఖరు..

జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు (గురువారం) సాయంత్రం..

Attention: మరికొన్ని గంటల్లో ముగియనున్న జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌! నేడే ఆఖరు..
Jee Main 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 7:50 AM

JEE Main 2022 session 1 registration ends today: జేఈఈ మెయిన్ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ఈ రోజుతో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ ఈ సందర్భంగా సూచించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఫీజు చెల్లింపులు ఈ రోజు రాత్రి11 గంటల 30 నిముషాల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన తేదీల విషయంలో దేశ వ్యాప్తంగా పలు చర్చలు కూడా జరిగాయి. ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ కొత్త తేదీలు వెలువడినప్పటికీ పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా తేదీలు అడ్డుగా ఉండటంతో ఇంటర్‌, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యుళ్లను కూడా మార్చి కొత్త టైం టేబుళ్లను విడుదల చేశాయి.

జేఈఈ మెయిన్ – 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించిన కొత్త తేదీలు (JEE Main 2022 revised exam dates).. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ – 2022 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి వయోపరిమితి లేదు. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లు ఎప్పుడు విడుదల అవుతాయనేది ఎన్టీఏ తర్వలో ప్రకటించనుంది.

Also Read:

IGNOU B.Ed Admissions 2022: ఇగ్నో 2022 జనవరి సెషన్‌ బీఎడ్‌ అడ్మిషన్లు షురూ! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?