ECIL Recruitment: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

ECIL Recruitment: హైదరాబాద్ (Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో...

ECIL Recruitment: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Ecil Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 30, 2022 | 5:29 PM

ECIL Recruitment: హైదరాబాద్ (Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టెక్నికల్ ఆఫీసర్లు (13), సైంటిఫిక్‌ అసిస్టెంట్లు (04), సీనియర్‌ ఆర్టిజన్‌ (01), జూనియర్‌ ఆర్టిజన్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 25 నుంచి 30

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను ముంబయి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్‌ రీజినల్‌ ఆఫీసుల్లో 12-04-2022వ తేదీన నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Health Tips: పాలు తాగితే శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుందా..!

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఎవరెవరికి ఎంత పెరుగుతుందంటే!

Health Tips: పెళ్లయిన మగవారు కచ్చితంగా ఈ 3 ఆహారాలు తినాలి.. అప్పుడే పూర్తి ఫిట్‌గా ఉంటారు..!