Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఎవరెవరికి ఎంత పెరుగుతుందంటే!

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది సర్కార్. ఏడవ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వానికి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) లో 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

DA Hike:  ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఎవరెవరికి ఎంత పెరుగుతుందంటే!
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 30, 2022 | 3:11 PM

7th Pay Commission DA Hike: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) శుభవార్త అందించింది సర్కార్. ఏడవ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వాని(Union Government)కి డియర్‌నెస్ అలవెన్స్ (DA) లో 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో బేసిక్ పేలో 34% డీఏ అవుతుంది. ఈ చర్య 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) డియర్‌నెస్ రిలీఫ్ (DR) గణన , లేబర్ బ్యూరో, మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPIIW) ప్రకారం కార్మిక, ఉపాధి రేటు ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది.

2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.01 శాతంగా ఉంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.07 శాతానికి పెరిగింది. విశేషమేమిటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు అదనపు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) విడుదలకు ఆమోదం తెలిపింది. జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను గతంలో 31 శాతం నుండి 34 శాతానికి 3 శాతం పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల జరిగింది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి కారణంగా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ.9,488.70 కోట్లుగా ఉంటుంది. దీని వల్ల దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఇది సివిల్ ఉద్యోగులు, రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది.

Read Also…SBI Recruitment: ఎస్‌బీఐలో టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..