SBI Recruitment: ఎస్‌బీఐలో టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో...
SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
* వీటితో పాటు సంబంధిన పనిలో కనీసం 12 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులను 5 ఏళ్ల కాంట్రాక్ట్ పీరియడ్ కోసం తీసుకోనున్నారు.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (31-03-2022) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!
Puri Jagannath: చిరుతో నా ప్రాజెక్ట్ అందుకే ఆగిపోయింది.. మనసులో మాట బయట పెట్టిన పూరీ జగన్నాథ్