డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారం.. కట్ చేస్తే

మ‌హిళ‌లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చ‌ట్టాలు తీసుకొచ్చినా.. వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీలు ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మ‌రి కొంత మంది...

డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారం.. కట్ చేస్తే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 30, 2022 | 4:24 PM

మ‌హిళ‌లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చ‌ట్టాలు తీసుకొచ్చినా.. వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీలు ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మ‌రి కొంత మంది ప్రేమ పేరుతో న‌మ్మించి, వారిపై దారుణాల‌కు పాల్పడుతున్నారు. తాజాగా బెంగ‌ళూరులో ఇలాంటి ఘ‌ట‌నే జరిగింది. డేటింగ్ యాప్ లో అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకున్న యువకుడు.. ఆమెపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ప‌శ్చిమ బెంగాల్ (west bengal)కు చెందిన ఓ మ‌హిళ క‌ర్ణాట‌క (karnataka) రాజ‌ధానిలోని బెంగ‌ళూరులో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో న‌ర్సుగా ప‌ని చేస్తున్నారు. ఇదే నగరంలో రజత్ సురేష్, యోగేష్ కుమార్, శివరానా టెక్ చంద్రనా, దేవ్ సరోహా అనే యువ‌కులు నివాసముంటున్నారు. వీరందరూ సంజయ్‌నగర్‌లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ర‌జ‌త్ అనే యువ‌కుడు డేటింగ్ యాప్ లో సదరు న‌ర్సుతో పరిచయం ఏర్పండింది.

ఈ పరిచయం ఇరువురూ ఫోన్ నంబర్లు మార్చుకునేంత వరకు వెళ్లింది. ఫోన్ నెంబ‌ర్లతో ఇద్దరి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. ర‌జ‌త్ ఆ యువ‌తిని రెండు సార్లు కలుసుకున్నాడు. మార్చి 24 ఆమెను రెస్టారెంట్‌లో డిన్నర్‌కు పిలిచాడు. రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన త‌రువాత త‌న అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ రజత్ తన న‌లుగురు స్నేహితులతో క‌లిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు మార్చి 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.

ఘటన జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్న విషయం తెలుసుకున్న రజత్.. బెంగళూరు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదే రోజు రాత్రి ఢిల్లీ (delhi)కి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే విమానం బ‌య‌లుదేరేందుకు కొన్ని గంట‌ల ముందు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడిని పోలీసులు ప‌ట్టుకున్నారు. మిగిలిన నిందితుల‌ను వివిధ ప్రాంతాల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read

Nithin: నితిన్‌ బర్త్‌డే స్పెషల్‌.. మాచర్ల నియోజకవర్గం నుంచి ఫస్ట్‌ ‘అటాక్‌’ వచ్చేసింది..

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఎవరెవరికి ఎంత పెరుగుతుందంటే!

AP New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజనకు కేబినెట్‌ ఆమోదం.. జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!