AP New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం.. జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు..
AP Cabinet: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపింది కేబినెట్.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP Cabinet)ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపింది కేబినెట్. తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్ నుంచి త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ ఉండబోతోంది. ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం జరుగనుంది. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమంతోపాటు.. ఆయా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు, CSతో సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇచ్చిన జిల్లాల నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులు, జిల్లా పేర్లు, కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లపై పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాల పేర్లు, పరిధుల కంటే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. స్థానికంగా వచ్చిన డిమాండ్లు, విజ్ఞప్తుల ఆధారంగా రెవెన్యూ డివిజన్లపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అయితే.. మండలాలు, గ్రామాలను వేరే జిల్లాల్లోకి మార్చే అంశంపై సందిగ్ధన నెలకొంది. ఈ డిమాండ్లపై అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
వీటిపై ముఖ్యమంత్రే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా అనుకున్న సమయానికి కొత్త జిల్లాలు ప్రారంభించేందుకు పండగ కంటే ముందే తుదినోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్లు, విజ్ఞప్తులు, మార్పులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు దాదాపు పూర్తైంది. ముఖ్యంగా ఉగాది నుంచి పాలన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్లు, SP కార్యాలయాల కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తైంది. ఎంపిక చేసిన భవనాల్లో వసతులకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాపై ఇప్పటికే ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల పైచిలుకు అభ్యంతరాలు, సలహాలు ప్రభుత్వానికి అందాయి. కొన్ని జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొన్ని మండలాలను వేరే జిల్లాలో కొనసాగించడం వంటి డిమాండ్లు వచ్చాయి. అన్నింటిపై ప్రణాళిక శాఖ అధికారులతో పాటు రాష్ట్ర కమిటీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి CMకు రిపోర్ట్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై CM జగన్ అధికారులతో సమీక్ష చేశారు. ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్లాలని CM నిర్ణయించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి: Mirchi Rate: ఆకాశాన్ని తాకిన ఎర్ర బంగారం ధర.. రికార్డులు బ్రేక్.. క్వింటా రేటెంతో తెలిస్తే షాకే..
Viral Video: అమ్మ బాబోయ్.. ఏసీ నుంచి ఎలుకను వేటాడిన భారీ పాము.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్..
ASHA Workers: ఆశా కార్యకర్తలకు ఇవెందుకు అంటూ అభ్యంతరాలు.. మహారాష్ట్రలో తెరపైకి కొత్త వివాదం..