AP Cabinet Expansion: ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్?.. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ..
YS Jagan New Cabinet: ఏపీ కేబినెట్ రీషఫుల్‌కు ముహూర్తం ఖరారైపోయింది. ఏప్రిల్ 11నే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. మరి, కొత్త కేబినెట్‌లోకి వచ్చేదెవరు? కొనసాగింపు దక్కేదెవరికి?
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు(AP Cabinet Expansion) దాదాపు ముహూర్తం ఖరారైపోయింది. ఉగాది తర్వాత ఎప్పుడైనా కేబినెట్ రీషఫుల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా.. మంత్రివర్గ మార్పులు.. కూర్పులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. రాజీనామాలకు సిద్ధమవ్వాలని మంత్రులకే స్వయంగా చెప్పిన సీఎం.. అయితే మంత్రి పదవి పోయిందని ఎవరూ నిరాశకు గురి కావొద్దన్నారు. పార్టీ బాధ్యతలు అప్పచెబుతానని స్పష్టం చేశారు. మళ్లీ పార్టీ విజయానికి అంతా కష్టపడాలని సూచనలు చేశారు. అలాగే ఈ సారి మంత్రి పదవులకు భారీగా పోటీ ఉందని.. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో చాలా మంది మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.. తమ పదవి పోయినట్టేనా అని మదన పడుతున్నారు. మరి, కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఇప్పుడున్నవాళ్లలో ఎంతమందికి కొనసాగింపు ఉంటుంది? పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుంటారా? లేక కొత్త జిల్లాల ప్రకారం చోటు కల్పిస్తారా? ఇప్పుడున్న కుల సమీకరణాలనే పాటిస్తారా? లేకపోతే కొత్త కుల లెక్కల్ని తెరపైకి తెస్తారా? అసలు, ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ దక్కనుందో ఇప్పుడు చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా..
శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు, ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్, కులం వెలమ. కృష్ణదాస్ ప్లేస్‌లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అపార రాజకీయ అనుభవం, వాక్చాతుర్యం, వైఎస్సార్ లాయలిస్ట్ కలిసొస్తాయని భావిస్తున్నారు.
ఇక, శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి సీదిరి అప్పలరాజు. మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను కూడా తప్పించబోతున్నారు. సీదిరి స్థానంలో అదే వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా MLA పొన్నాడ సతీష్ పేరుతో వినిపిస్తోంది.
ప్రస్తుతం… రేసులో…
ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పొన్నాడ సతీష్
విజయనగరం జిల్లా నుంచి..
విజయనగరం జిల్లా నుంచి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు. సీనియర్ లీడర్, మంత్రి బొత్స సత్యనారాయణను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరో మంత్రి పుష్ప శ్రీవాణి స్థానంలో రాజన్నదొర, పాడేరుకు చెందిన భాగ్యలక్ష్మి, అరకు ఫాల్గుణ, పోలవరం బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. రాజన్నదొర, బాలరాజు మధ్య పోటీ కనిపిస్తోంది. అయితే, ఈ జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం… రేసులో…
బొత్స సత్యనారాయణ బొత్స అప్పలనర్సయ్య / కోలగట్ల వీరభద్రస్వామి
పుష్ప శ్రీవాణి రాజన్నదొర / భాగ్యలక్ష్మి / ఫాల్గుణ / బాలరాజు
విశాఖ జిల్లా నుంచి..
విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్క మంత్రి అవంతి ఉన్నారు. అవంతి స్థానంలో గుడివాడ అమర్‌నాథ్ మంత్రి పదవికి ఆశిస్తున్నారు. గణేష్, బూడి ముత్యాలనాయుడు కూడా రేస్‌లో ఉన్నారు. మరి, ఈ ముగ్గురిలో ఎవరు ఇన్ అవుతారో, ఎవరు డ్రాప్ అవుతారో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం… రేసులో…
అవంతి శ్రీనివాస్ అమర్‌నాథ్ / గణేష్ / ముత్యాలనాయుడు
తూర్పుగోదావరి నుంచి..
తూర్పుగోదావరి నుంచి కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, వేణు మంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురినీ మార్చడం దాదాపు ఖాయం. కన్నబాబు ప్లేస్‌లో దాడిశెట్టి రాజా, వేణు స్థానంలో పొన్నాడ పదవులను ఆశిస్తున్నారు. విశ్వరూప్ ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే, ఎస్సీ కోటాలో పి.గన్నవరం MLA చిట్టిబాబు, రెడ్డి కోటాలో జగ్గిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేస్‌లో ఉన్నారు.
ప్రస్తుతం… రేసులో…
కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా / జగ్గిరెడ్డి / సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి
పినిపె విశ్వరూప్ పొన్నాడ సతీష్
వేణు చిట్టిబాబు
పశ్చిమగోదావరి నుంచి..
పశ్చిమగోదావరి నుంచి కూడా ప్రజెంట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు స్థానాల్లో భారీ పోటీనే నెలకొంది. ఎలీజా, వెంకట్రావు, గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, ప్రసాదరాజు, కారుమూరి రేస్‌లో ఉన్నారు.
ప్రస్తుతం… రేసులో…
ఆళ్ల నాని గ్రంథి శ్రీనివాస్ / కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత ఎలీజా / వెంకట్రావు
రంగనాథరాజు ప్రసాదరాజు / కారుమూరి
కృష్ణాజిల్లా నుంచి..
కృష్ణాజిల్లా నుంచి కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని… ఇద్దరు కూడా మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నారు. కొడాలి ప్లేస్‌లో అదే సామాజికవర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ పదవిని ఆశిస్తున్నారు. ఇక, పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, డీఎన్‌ఆర్ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో సామినేనికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది. కుల సమీకరణలో భాగంగా వెల్లంపల్లి ప్లేస్‌ను విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల, ప్రకాశం జిల్లాకు చెందిన అన్నే రాంబాబు ఆశిస్తున్నారు. జోగి రమేష్, పార్థసారధి కూడా రేసులో ఉన్నారు.
ప్రస్తుతం… రేసులో…
కొడాలి నాని వసంత కృష్ణప్రసాద్
పేర్ని నాని ఉదయభాను / డీఎన్‌ఆర్
వెల్లంపల్లి కోలగట్ల / అన్నే రాంబాబు
గుంటూరు జిల్లా నుంచి..
గుంటూరు జిల్లా నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున పేర్లు వినిపిస్తున్నాయ్. రెడ్డి, కాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు ఇక్కడ్నుంచి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత మంత్రిగా ఉన్నారు.
ప్రకాశం జిల్లా నుంచి..
ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ్నుంచి బుర్రా మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌బాబు పేర్లు వినిపిస్తున్నాయ్. బాలినేని స్థానం, బీసీకి దక్కే అవకాశం కనిపిస్తోంది.
నెల్లూరు నుంచి కూడా పోటీ..
నెల్లూరు నుంచి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. కాకాని గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. అయితే, ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబం కూడా మంత్రి పదవిని ఆశిస్తోంది.
చిత్తూరు జిల్లా..
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ఉన్నారు. పెద్దిరెడ్డిని కొనసాగించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి భూమన కరుణాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఆర్కే రోజా పోటీపడుతున్నారు. నారాయణస్వామి ప్లేస్‌లో అదే సామాజికవర్గానికి చెందిన ఆదిమూలం, MS బాబు పేర్లు వినిపిస్తున్నాయ్. చిత్తూరు శ్రీనివాసులు, పీలేరు రామచంద్రారెడ్డి కూడా రేస్‌లో ఉన్నారు
కర్నూలు..
కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మలూరి జయరాములు మంత్రులుగా ఉన్నారు. బుగ్గన స్థానంలో చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూల్, కంగాటి శ్రీదేవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాలనాగిరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీసీ బోయ కులానికి చెందిన జయరాములు ప్లేస్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియడం లేదు.
అనంతపురం..
అనంతపురం జిల్లా నుంచి ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాపు రామచంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఉషాచరణ్‌శ్రీ, జొన్నలగడ్డ పద్మావతి రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి శంకర్ నారాయణ మంత్రిగా ఉన్నారు.
కీలకమైన జిల్లా కడప..
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అత్యంత కీలకమైన జిల్లా కడప, ఇక్కడ్నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుంటే, అంజాద్ బాషా మంత్రిగా ఉన్నారు. ఇక్కడ్నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. బద్వేలు MLA డాక్టర్ సుధ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, అంజాద్ ప్లేస్‌లో కర్నూలు MLA హఫీజ్ ఖాన్ రేసులో ఉన్నారు.
మొత్తంగా ఆశావహులు లిస్ట్ పెద్దగానే ఉంది. అసంతృప్తులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో, వీలైనంత త్వరగా, అంటే ఉగాది తర్వాతే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టి, అసంతృప్తి జ్వాలలకు పుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
ఇవి కూడా చదవండి: Mirchi Rate: ఆకాశాన్ని తాకిన ఎర్ర బంగారం ధర.. రికార్డులు బ్రేక్.. క్వింటా రేటెంతో తెలిస్తే షాకే..
Viral Video: అమ్మ బాబోయ్.. ఏసీ నుంచి ఎలుకను వేటాడిన భారీ పాము.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్..
ASHA Workers: ఆశా కార్యకర్తలకు ఇవెందుకు అంటూ అభ్యంతరాలు.. మహారాష్ట్రలో తెరపైకి కొత్త వివాదం..