Electricity Charges Hike: ప్రజలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. భారీగా విద్యుత్‌ చార్జీల పెంపు

Electricity Charges Hike: ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం మోపింది ఏపీ ప్రభుత్వం..

Electricity Charges Hike: ప్రజలకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. భారీగా విద్యుత్‌ చార్జీల పెంపు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 30, 2022 | 1:41 PM

Electricity Charges Hike: ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం మోపింది ఏపీ ప్రభుత్వం. ప్రజలకు కరెంట్‌ సంస్థలు షాక్‌ ఇచ్చాయి. అన్ని స్లాబుల్లో ధరలు పెరిగాపోయాయి. ఈ పెంపు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. గతంలో ఉన్న కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లుగా రేట్లను ఖరారు చేశారు. సామాన్యులు ఎక్కువగా వాడే యూనిట్లలోనే రేట్లు ఎక్కువగా పెరిగాయి. మొత్తంగా ఎక్కువగా సామాన్యులపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతవుతున్న ఏపీ (AP) ప్రజలకు విద్యుత్‌ చార్జీలను పెంచుతూ షాకిచ్చింది ప్రభుత్వం.30 యూనిట్లకుపైగా వాడిన వారికి ఈ పెంపు వర్తించనుంది. పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ (APERC) చైర్మన్ విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్, రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రకటించారు. డిస్కిం కంపెనీల లోటును పూడ్చుకునేందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందన్నారు APERC ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి. ప్రజలపై ధరల పెంపు బాధగా ఉన్నా.. తప్పడం లేదంటున్నారు. విద్యుత్‌ చార్జీల టారిఫ్‌ను తిరుపతిలో విడుదల చేశారు. ఈసారి కేటగిరీలను రద్దు చేసి… 6 స్లాబ్‌లను తీసుకొచ్చామన్నారాయన.

ధరలను పెంచడం తప్పని సరికావడంతోనే గృహ వినియోగదారులపై భారం వేస్తున్నాం. ఇష్టం లేకపోయినా కష్టంగానే విద్యుత్ చార్జీలు పెంచుతున్నాం. అందరూ అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్లుగా ధరలు పెంచలేదు. డిస్కంల మనుగడ, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొనే పెంచుతున్నాం. దేశమంతా బొగ్గుకు కొరత ఉంది. డబ్బులు పెట్టి కొనాలనుకున్నా బొగ్గు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే మరీ భారం పడకుండా, సామాన్యులపై భారం వేస్తున్నాం. జాతీయ విద్యుత్ టారీఫ్ విధానాన్ని అనుసరించే చార్జీలు పెంచాం. సంతోషంతో ధరలు పెంచడం లేదు. అనేక కారణాల వల్ల డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరల వివరాలు:

☛ 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు పెంపు

☛ 31-75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు

☛ 76-125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.40 పెంపు

☛ 126-225 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.57 పెంపు

☛ 226-400 యూనిట్లకు రూ.1.16 పైసలు పెంపు

☛ 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు

ఇవి కూడా చదవండి:

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో ఉత్కంఠ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..?

TTD Recruitment 2022: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టులో రూ.54 వేల జీతంతో ఉద్యోగాలు.. అర్హతలివే!