AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో ఉత్కంఠ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..?

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు తేదీ ఖరారైందని తెలుస్తుండటంతో..

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ.. ఆశావహుల్లో ఉత్కంఠ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే..?
Subhash Goud
|

Updated on: Mar 30, 2022 | 1:10 PM

Share

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు తేదీ ఖరారైందని తెలుస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. వచ్చే నెల 8న గవర్నర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) భేటీ కానున్నారు. ఆ సమావేశంలో గవర్నర్‌కు కేబినెట్‌ (Cabinet) పునర్‌వ్యవస్థీకరణ గురించి వివరిస్తారు సీఎం. వచ్చే నెల 11వ తేదీ అపాయింట్‌మెంట్‌ కావాలని కోరనున్నారు. 11వ తేదీనే కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం జగన్‌ విందు ఇస్తారు. అయితే ప్రస్తుత కేబినెట్‌ నుంచి ఒకరు లేదా ఇద్దరికి చాన్స్‌ ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు సమూల మార్పులు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకో మంత్రి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐదు డిప్యూటీ సీఎంల హోదాలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఉండనుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్‌కు అవకాశం ఉంది.

కొడాలి నాని స్థానంలో వసంత కృష్ణప్సాద్‌ పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో కొలగట్ల లేదా అన్నెరాంబాబు, కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారధి, జోగి రమేష్‌ ఉన్నారు. గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి, గుంటూరు నుంచి విడుదల రజిని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు స్థానం నుంచి సుధకర్‌బాబుకు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. చిత్తురు నుంచి రోజా, భూమన, మధుసూదన్‌రెడ్డికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి చక్రపాణిరెడ్డి, కాటసాని, కంగాటి శ్రీదేవి, అనంతపురం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణశ్రీ, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కడప నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు, డాక్టర్‌ సుధా, అంజాద్‌బాషా స్థానంలో హఫీజ్‌ఖాన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్పశ్రీ వాణి స్థానంలో రాజన్నదొర, భాగ్యలక్ష్మి, అరకు ఫల్గుణ, పోలవరం బాలరాజు, అవతి స్థానంలో గుడివాడ అమర్నాథ్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు సీఎం జగన్‌ సమీక్ష

జిల్లా పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కొత్త జిల్లాలుగా ఏర్పడిన తర్వాత పాలనా, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Ugadi 2022: ఉగాది మహోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం.. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 3 వరకు మహోత్సవాలు

Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!