AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ బాబోయ్.. ఏసీ నుంచి ఎలుకను వేటాడిన భారీ పాము.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్..

ఈ మధ్య సోషల్ మీడియాలో పాముల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన యూజర్ల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అయితే చాలా మంది యూజర్లు ఇలాంటి థ్రిల్లింగ్ వీడియోలను..

Viral Video: అమ్మ బాబోయ్.. ఏసీ నుంచి ఎలుకను వేటాడిన భారీ పాము.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్..
Snake Catch The Rat
Sanjay Kasula
|

Updated on: Mar 30, 2022 | 11:09 AM

Share

ఈ మధ్య సోషల్ మీడియాలో పాముల వీడియోలు వైరల్(Viral Video) అవుతున్నాయి. అవి చూసిన యూజర్ల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అయితే చాలా మంది యూజర్లు ఇలాంటి థ్రిల్లింగ్ వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో జంతువుల గగుర్పాటు కలిగించే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ విషసర్పం వీడియో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. ఎండలు దంచి కొడుతుండటంతో ఇంట్లో మూలకు పడేసిన కూలర్లు, ఏసీ మిషన్లకు ఉన్న కవర్లను తీసి రెడీ చేస్తున్నారు. అయితే ఇంత కాలం వాటిని పక్కన పెట్టడంతో అందులో ఎలుకలతోపాటు మిగిలిన జీవాలు కాపురాలు పెట్టి ఉంటాయి. కొన్ని సార్లు అందులో పాములు కూడా చేరుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వెలుగు చూసింది.

వేసవి ప్రారంభం కాగానే చాలా ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఏసీని వినియోగిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోను చూసి మీరు కూడా మీ ACని ఉపయోగించే ముందు వందసార్లు ఆలోచించవలసి ఉంటుంది. నిజానికి, ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలో ఒక విషపూరిత పాము AC మిషన్‌ను తన ఇంటిగా మార్చుకుంది.

సాధారణంగా ప్రతి ఒక్కరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి పాము మీ ఇంట్లో ఏదైనా వస్తువును తన ఇల్లుగా చేసుకుంటే.. అప్పుడు ఏం చేయాలి.. ఈ వీడియోలో విషపూరిత పాము ఏసీలోంచి సగం శరీరాన్ని భయానకంగా బయటకు తీసిన తర్వాత ఏసీ లోపలికి వెళ్లి ఎలుకను వేటాడి మింగుతున్న దృశ్యం మనం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చూసిన యూజర్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోకు వార్త రాసే వరకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు వేల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. వీడియో చూసిన తర్వాత థ్రిల్‌తో పాటు, యూజర్లు  కూడా అలర్ట్ అయ్యారు. అదే సమయంలో యూజర్లు తమదైన తరహాలో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Mamata Banerjee: ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై ఐక్యపోరాటం.. విపక్ష నేతలకు బెంగాల్‌ సీఎం మమత పిలుపు..

RGV: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..