RGV: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..

RGV: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ (Puneeth Rajkumar) లేరన్న వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్‌ హీరో హఠాన్మరణంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే..

RGV: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..
Rgv
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2022 | 6:39 PM

RGV: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ (Puneeth Rajkumar) లేరన్న వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్‌ హీరో హఠాన్మరణంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే. పునీత్‌ రాజ్‌కుమార్‌ను ఆయన అభిమానులు ఇప్పటికీ ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పడానికి ఇటీవల విడుదలైన ఆయన చివరి చిత్రం జేమ్స్‌ ఉదాహరణ. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ అభిమాన హీరోని చూసిన అభిమానులు కంట తడి పెట్టుకున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే పునీత్‌ మరణానంతరం బెంగళూరులో ఆయన జ్ఞాపకార్థం స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ప్రతీ రోజూ ఆయన ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా పునీత్ స్మృతివనాన్ని సందర్శించారు. తన లేటెస్ట్‌ చిత్రం ‘మా ఇష్టం’ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన వర్మ పునీత్‌ ఘాట్‌ను సందర్శించి, ఆయన సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు వర్మ.

కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రీకరణ సమయంలో పునీత్‌ను పలుసార్లు కలిసినట్లు తెలిపిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఇక పునీత్‌ మరణించినా ప్రేక్షకుల హృదయాల్లో హీరోగానే ఉన్నాడని కొనియాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసిన వర్మ కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో పునీత్ రాజ్‌ కుమార్‌ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన విషయం తెలిసిందే.

Also Read: Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు

Karnataka: కర్ణాటకలో తెరపైకి మరో వివాదం.. ఆలయాల పరిసరాలల్లో హిందూయేతర వ్యాపారస్తులకు అనుమతి వద్దంటూ ప్రభుత్వానికి వినతి

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం.. ఇది ఎవరు చేశారన్నది సస్పెన్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!