AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు

Street Food India: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని ఓ సినీ కవి చెప్పినట్లు.. చాలామంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదని, పనికి తగిన జీతం లభించడం లేదని..

Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు
Momos Cart
Surya Kala
|

Updated on: Mar 29, 2022 | 4:55 PM

Share

Street Food India: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని ఓ సినీ కవి చెప్పినట్లు.. చాలామంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదని, పనికి తగిన జీతం లభించడం లేదని మరికొందరు..  పనిచేయడం ఇష్టం  కొందరు ఇలా రకరకాల కారణాలతో..  పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ కాలం గడిపేస్తుంటారు. అయితే కానీ.. కొంద‌రు మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబ‌ర్ (Dignity of labour) అనేదాన్ని న‌మ్ముతారు. అందుకే.. న్యాయంగా.. నిజాయితీగా కష్టపడి ఏపనైనా చేసుకొని బ‌తుకుతారు. అటువంటి కోవ‌కు చెందిన వాడే ఈ వ్యక్తి. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇత‌డు.. హ‌ర్యానాలోని ఫ‌రిదాబాద్‌లో సైకిల్ మీద మోమోస్ అమ్ముతున్నాడు. ఈరోజుల్లో సైకిల్ మీద స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్లు చాలా త‌క్కువ‌. బేల్‌పురి, పానీపూరీ, దోశ లాంటివి సైకిళ్లపై తీసుకొచ్చి అమ్మడం చూశాం కానీ.. సైకిల్ మీద మోమోస్ అమ్మేవాళ్లను ఎప్పుడూ చూడ‌లేదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫ‌రిదాబాద్‌లో సైకిల్ మీద మోమోస్ అమ్ముతున్న ఈ వ్యక్తి.. ఫుడ్ బ్లాగ‌ర్ విశాల్ కంట‌ప‌డ్డాడు. దీంతో సైకిల్ మీద మోమోస్ ఎలా సెట్ చేశాడు. మోమోస్‌ను వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ ఎలా అమ్ముతాడు.. రోజుకు ఎంత గిట్టుబాటు అవుతుంది.. అనే విష‌యాల‌ను విశాల్ అడిగి తెలుసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను త‌న యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు.. వావ్.. సూప‌ర్.. సైకిల్ మీద మోమోస్ అమ్ముతూ ఎంతో క‌ష్టప‌డుతున్నావు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో సైకిల్ మోమోస్ ను అమ్ముతున్నాడు. దీంతో నెటిజన్లు అతని కష్టని గుర్తిస్తూ.. నీ క‌ష్టానికి తప్పక ప్రతిఫ‌లం దక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: Ragi Cutlet Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా.. అయితే టేస్టీ టేస్టీ రాగి కట్లెట్ రెసిపీ మీకోసం

YS Jagan: తెలంగాణ హైకోర్టుకు ఏపీ సీఎం.. కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్‌..