Ragi Cutlet Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా.. అయితే టేస్టీ టేస్టీ రాగి కట్లెట్ రెసిపీ మీకోసం

Ragi Cutlet Recipe:సాయంత్రం టీ తీసుకునే సమయంలో స్నాక్స్ (snacks) కూడా ఉంటె బాగుంటుంది అనిపిస్తుంది. రుచికరమైన స్నాక్స్ లేకుండా టీ సమయం అసంపూర్ణంగా..

Ragi Cutlet Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా.. అయితే టేస్టీ టేస్టీ రాగి కట్లెట్ రెసిపీ మీకోసం
Ragi Cutlet Recipe
Follow us

|

Updated on: Mar 29, 2022 | 4:17 PM

Ragi Cutlet Recipe:సాయంత్రం టీ తీసుకునే సమయంలో స్నాక్స్ (snacks) కూడా ఉంటె బాగుంటుంది అనిపిస్తుంది. రుచికరమైన స్నాక్స్ లేకుండా టీ సమయం అసంపూర్ణంగా ఉంటుంది. అయితే రోజు తయారు చేసుకునే  స్నాక్స్  సమోసా, బోండా, పకోడా ఇవేనా రోజూ.. అబ్బో బోర్ అని ఫీల్ అవుతారు.. పిల్లలైనా పెద్దలైనా.. అందుకనే డిఫరెంట్ స్నాక్ ఐటెమ్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. రెగ్యులర్ స్నాక్స్ కంటే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈజీగా తయారు చేసుకునే స్నాక్స్ కోసం ట్రై చేసేవారి కోసం ఈరోజు రాగి కట్లెట్స్ తయారీ విధానం తెలుసుకుందాం.

రాగి కట్లెట్: ఎవరైనా సరే రుచికరమైన,  టేస్టీగా, ఆరోగ్యకరమైన స్నాక్స్ కోరుకునేవారికి బెస్ట్ ఎంపిక రాగి కట్‌లెట్ . ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచికరమైన చట్నీలు , డిప్‌లతో జత చేసుకుని తినడానికి పిల్లలు కూడా ఆసక్తిని చూపిస్తారు.

రాగి కట్లెట్ కావలసిన పదార్ధాలు: రాగి పిండి 1 కప్పు బంగాళాదుంప- గుజ్జు (2-3 కప్పులు) ఉల్లిపాయ – 1 తరిగిన క్యారెట్ -1 తరిగిన క్యాబేజీ -1 తరిగిన రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ మిరియాల పొడి 1/2 స్పూన్ ఉప్పు – రుచికి సరిపడా నూనె

రాగి కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో తరిగిన క్యారెట్, ఉల్లిపాయలు, క్యాబేజీ , మెత్తని బంగాళాదుంపని వేసుకుని.. మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమంలో ఎర్ర కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, ఉప్పు , గరం మసాలా జోడించండి..  బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమంలో ఇప్పుడు దీనికి రాగి పిండిని వేసి కలిపి మెత్తగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గుండ్రటి ఉండలుగా తయారు చేసుకుని.. వాటిని కట్లెట్ ఆకారంలో రెడీ చేసుకోవాలి. అనంతరం స్టౌ మీద పాన్ పెట్టి.. నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. లేదా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన రాగి కట్లెట్స్ రెడీ

Also Read: Karnataka: కర్ణాటకలో తెరపైకి మరో వివాదం.. ఆలయాల పరిసరాలల్లో హిందూయేతర వ్యాపారస్తులకు అనుమతి వద్దంటూ ప్రభుత్వానికి వినతి