- Telugu News Photo Gallery Women at 40: After reaching this age, if women fall into this, the body will be perfectly fit
Women at 40 : నలభై ఏళ్లు దాటిన మహిళలు ఫిట్‌గా, హెల్దీగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే..
మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అనేక శారీరక సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మహిళలు బలమైన పోషకాహారం తీసుకోవాలి. తద్వారా శరీరాన్ని, మనసును ఫిట్‌గా ఉంచుకోవచ్చు.
Updated on: Mar 29, 2022 | 2:13 PM

తులసి టీ: దీర్ఘకాలిక కీళ్లనొప్పులు లేదా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న మహిళలు తులసి టీని తీసుకోవాలి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకుల్లో సత్వర ఉపశమనాన్ని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందకే తరచూ దీనిని తీసుకోవడం వల్ల ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

గ్రీన్ వెజిటేబుల్స్: ఏ వయసువారైనా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాల్సిందే. 40 ఏళ్ల దాటిన వారైతే తప్పనిసరిగా కూరగాయలు తీసుకోవాల్సిందే. ఫిట్‌గా ఉండటానికి,అల్పాహారంగా క్యాబేజీ శాండ్‌విచ్‌లను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

పెరుగు: 40 సంవత్సరాల వయస్సు తర్వాత స్త్రీలు, పురుషులైనా ఎముకల్లో సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు అల్పాహారంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు పెరుగు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

చియా విత్తనాలు: శరీరానికి అత్యంత ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చియా విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. చియా గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం స్మూతీల రూపంలో అల్పాహారంగా తీసుకుంటే గరిష్ఠ ప్రయోజనాలు పొందవచ్చు.

గుడ్లు; ఎముకలతో పాటు కండరాలను బలపరిచే గుణాలు గుడ్లలో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని కోలిన్ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. 40 దాటిన మహిళలు రోజూ కనీసం రెండు గుడ్లను అల్పాహారంగా తీసుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.

40 ఏళ్లు దాటిన మహిళలకు శారీరక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు అధికంగా ఎదురవుతాయి




