- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 rcb vs pbks virat kohli 5th place in most t20 runs batters list david warner
Virat Kohli Record, IPL 2022: తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఓ స్పెషల్ రికార్డులో చేరిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు IPL-2022ని విజయంతో ప్రారంభించి ఉండకపోవచ్చు.. కానీ, విరాట్ కోహ్లీ తన పేరు మీద ఓ స్పెషల్ రికార్డును మాత్రం సృష్టించాడు.
Updated on: Mar 29, 2022 | 7:13 PM

ఐపీఎల్-2022లో ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. అందులో ఒకటి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. గత సీజన్‌లోనే ఈ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో మైదానంలోకి రాగానే ప్రేక్షకులు అతనికి ఘనస్వాగతం పలికారు. కోహ్లీ కెప్టెన్ కాకపోవచ్చు కానీ.. బ్యాటింగ్‌కు ముందు మ్యాచ్‌లో గొప్పతనాన్ని ప్రదర్శించి ఓ ఆస్ట్రేలియా ఆటగాడిని వెనక్కనెట్టాడు.

ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ 41 పరుగులు చేశాడు. అదే క్రమంలో అతను T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌ను అధిగమించి ఐదో స్థానంలో నిలిచాడు.

డేవిడ్ వార్నర్ 313 టీ20 మ్యాచ్‌ల్లో 10,308 పరుగులు చేశాడు. కోహ్లి అతనిని వెనక్కు నెట్టి టాప్-5లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతను 327 మ్యాచ్‌లలో 10,314 పరుగులు చేశాడు. కోహ్లి 41.75 సగటుతో ఈ పరుగులు సాధించగా, వార్నర్ 37.75 సగటుతో పరుగులు చేశాడు.

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఈ విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. గేల్ 463 టీ20 మ్యాచ్‌లు ఆడి 14,562 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 36.22గా ఉంది. ఈ ఫార్మాట్‌లో అతని పేరుతో 22 సెంచరీలు ఉన్నాయి.

472 టీ20 మ్యాచుల్లో 11,698 పరుగులతో పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ రెండో స్థానంలో ఉన్నాడు. 582 టీ20 మ్యాచ్‌ల్లో 11,430 పరుగులు చేసిన కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 347 మ్యాచ్‌ల్లో 10, 444 పరుగులు చేశాడు.





























