Viral Video: చుట్టూ మంటలు.. ప్రాణాలకు తెగించి కంగారూలను కాపాడిన ఓ వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: ర‌ష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంతో అనేమంది జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. పశు పక్ష్యాదులు సైతం యుద్ధంకారణంగా మృత్యువాత పడుతున్నాయి..

Viral Video: చుట్టూ మంటలు.. ప్రాణాలకు తెగించి కంగారూలను కాపాడిన ఓ వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్
Russia Ukraine Crisis
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2022 | 3:11 PM

Viral Video: ర‌ష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంతో అనేమంది జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. పశు పక్ష్యాదులు సైతం యుద్ధంకారణంగా మృత్యువాత పడుతున్నాయి. ప్రకృతి అందాలతో భూతాల స్వర్గంగా కనిపించే ఉక్రెయిన్ ఇప్పుడు బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని త‌ల‌పిస్తోంది. నిత్యం బాంబు మోత‌ల‌తో ఉక్రెయిన్‌ దద్దరిల్లిపోతోంది.  కొంతమంది తమ ప్రాణాల కోసం పొరుగుదేశాలకు తరలిపోతుంటే.. మరికొందరు దిక్కుతోచని స్థితిలో ఉక్రెయిన్ లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధం ప్రారంభ‌మైన‌నాటినుంచి ఎక్కడో చోట కొందరు ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా నిలుస్తూ వారి ప్రాణాల‌ను కాపాడుతూ ప్రశంస‌లు పొందుతున్నారు. అయితే, ఓ వ్యక్తి ఎనిమిది మూగ జీవాల ప్రాణాలు కాపాడి, అందరితో శ‌భాష్ అనిపించుకున్నాడు.

బాంబు దాడుల వ‌ల్ల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోగ‌ల ఫెల్డ్‌మాన్‌ ఎకోపార్క్‌లో మంట‌లు చెల‌రేగాయి. అందులోని మూగ‌జీవాలు మంట‌ల్లో చిక్కుకున్నాయి. విష‌యం తెలుసుకున్న ఓ వ్యక్తి త‌న ప్రాణాల‌కు తెగించి ఎనిమిది కంగారూల‌ను కాపాడాడు. అనంత‌రం వాటిని వాహ‌నంలో అక్కడినుంచి వేరేచోటుకు త‌ర‌లించాడు. కంగారూల‌తో వెళ్తున్న ఆ వ్యక్తి వీడియో వైర‌ల్ అవుతుంది. మూగజీవాలను కాపాడిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు హీరోవి బాస్‌ అంటూ పొగుడుతున్నారు.

సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఉక్రెయిన్) హెడ్ ఒలెక్సాండ్రా మాట్విచుక్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కంగారులను రక్షించిన వ్యక్తికీ కృతఙ్ఞతలు చెప్పారు.

“ఎకోపార్క్ నుండి జంతువులను రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కంగారూలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ పార్క్ ఆవరణ పదేపదే బాంబు దాడికి గురవుంటుంది. అయితే అక్కడ జంతువులు సురక్షితంగా ఉంటాయని తాము నమ్ముతున్నట్లు చెప్పారు

” ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించడంలో వాలంటీర్లు, సిబ్బంది, స్నేహితులు, సాధారణ వ్యక్తులు, వ్యాపారస్థులు, కమ్యూనిటీ సంస్థలు తమకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయని .. అందుకనే మా రెస్క్యూ కార్యకలాపాలను సులభంగా చేయగలుగుతున్నామని చెప్పారు.

Also Read: Haryana: చపాతీ ఎక్కువ తిన్నదని అత్తగారిని కొట్టిన కోడలు.. పోలీసుల అదుపులో కోడలు, ఆమె ఫ్యామిలీ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!