AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం.. ఇది ఎవరు చేశారన్నది సస్పెన్స్..

ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగిందని తెలింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలయకున్నా.. కానీ..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం.. ఇది ఎవరు చేశారన్నది సస్పెన్స్..
Negotiators
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2022 | 2:23 PM

Share

యుద్ధంలో అన్ని ఉంటాయి. ఒక్కసారి యుద్ధం వస్తే ఇక ఏం జరిగిన అంతే.. ఇప్పుడు జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్ మరో మలుపు తీసుకుంది. మాస్కో చరిత్రలో మరో విషప్రయోగం వెలుగు చూసింది. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చల్లోని ప్రతినిధులపై విషప్రయోగం జరిగిందని తెలింది. ఇది ఎవరు చేశారన్నది ఇంకా తేలయకున్నా.. కానీ, మార్చి 3వ తేదీన ఉక్రెయిన్‌-బెలారస్‌ సరిహద్దుల్లో జరిగిన చర్చల్లో ఈ విష ప్రయోగం జరిగిందనే కొత్త కథనం వెలుగులోకి వచ్చింది. రష్యా ఒలిగార్క్‌ రోమన్‌ అబ్రహమోవిచ్‌, ఉక్రెయిన్‌ ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ పార్లమెంట్‌ డిప్యూటీ రుస్తెమ్‌ ఉమెరోవ్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చర్చల సమయంలో ఉక్రెయిన్‌ బృందం సభ్యుల కళ్లు ఎర్రగా మారిపోయి.. కొద్ది సేపు చూపు కూడా దెబ్బతింది. తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. ఈ విషయాన్ని ముందుగా వారు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక కథనంలో తెలిపారు.

ఈ ఘటన తర్వాత అబ్రహమోవిచ్‌, ఉమెరోవ్‌లు చికిత్స కోసం టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్లారు. వీరిపై ఏ రకం విషాన్ని ప్రయోగించారో ఇంకా గుర్తించలేదు. చర్చలకు ఇష్టపడని రష్యా అతివాదులే ఈ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయని బీబీసీ తన కథనంలో పేర్కొనడం విచిత్రం. రుస్తెమ్‌ ఉమెరోవ్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. వాస్తవానికి ఈ ఆరోపణలు పెరిగితే శాంతిచర్చల మొత్తానికే బ్రేక్ పడే ఛాన్స్ అందని ఈ వార్తలకు తీవ్రత తగ్గించి చూపుతున్నట్లు భావిస్తున్నారు. దాదాపు రెండు వారాల తర్వాత మరోసారి రష్యా-ఉక్రెయిన్‌ బృందాలు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరపనున్నాయి.

34వ రోజు చేరిన రష్యా దాడులు

ఇదిలావుంటే.. ఉక్రెయిన్‌పై వరుసగా 34వ రోజు కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మరియాపోల్‌ నగరాన్ని పూర్తిగా ఆక్రమించింది రష్యా. మరియాపోల్‌ పోరులో 5000 మంది సామాన్య పౌరులు చనిపోయినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ ఆయుధాలతో మరియాపోల్‌పై విరుచుకుపడ్డారు రష్యా సైనికులు. చెచెన్‌ దళాలు వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నాయి.

ఓవైపు యుద్ధం జరుగుతుండగానే మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. టర్కీలో ఇరుదేశాల ప్రతినిధి బృందాలు చర్చలు జరుపుతున్నాయి. ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇది ఆరోసారి. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. తనతో పెట్టుకుంటే సర్వనాశనం అవుతావని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ లోని ప్రధాన నగరాలను ధ్వంసం చేస్తోంది రష్యా . యూరప్‌లో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న ఖార్కీవ్‌ నగరం మొత్తం ధ్వంసమయ్యింది. నగరంలో ఎక్కడ చూసినా శిథిలాలే కన్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..