AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మళ్లీ కదలిక మొదలైంది. ఐటీ శాఖ నజర్‌తో 150 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు. నెక్ట్స్‌ ఎవరు రంగంలోకి దిగబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..
Gangster Nayeem
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2022 | 7:40 AM

Share

గ్యాంగ్‌స్టర్‌ నయీం(GANGSTER NAYEEM) కేసులో మళ్లీ కదలిక మొదలైంది. ఐటీ శాఖ నజర్‌తో 150 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు. నెక్ట్స్‌ ఎవరు రంగంలోకి దిగబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గ్యాంగ్​ స్టర్ నయీంకు సంబంధించిన బినామీ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఉన్న 10 ఆస్తులను అధికారులు ఇప్పటి వరకు జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం బినామీల పేరు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, అగ్రికల్చరల్ లాండ్స్  ఇందులో ఉన్నాయి. నయీం​కు సంబంధించిన మొత్తం 45 ఆస్తులను అధికారులు ఇప్పటికే తాత్కాలికంగా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ఆస్తులకు సంబంధించి ఇప్పటికే కొందరు బినామీలకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఆస్తులను ఎలా కూడబెట్టారనే ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానం లభించకపోవడంతో అందులోని 10 ఆస్తులను మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నయూం ఎన్​కౌంటర్..

షాద్​నగర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో నయూం మృతిచెందాడు. 2016 ఆగస్టు 8న ఈ ఘటన చోటు ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. నయీం ఎన్​కౌంటర్ కేసును ప్రభుత్వం.. సిట్​కు అప్పగించింది ప్రభుత్వం. దర్యాప్తులో అతని బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని సిట్ గుర్తించింది. అయితే.. పలువురు బాధితులు సైతం నయీం తమ ఆస్తులను లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు.

నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను సిట్ కోర్టులోనూ సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మిగతా ఆస్తులకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు. నయీం ఆస్తులపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..

Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..