Mirchi Rate: ఆకాశాన్ని తాకిన ఎర్ర బంగారం ధర.. రికార్డులు బ్రేక్.. క్వింటా రేటెంతో తెలిస్తే షాకే..
Mirchi Market Rate Today: పచ్చి మిర్చి రైతులు తమ నోట్లో చెరుకు రసం పడినంత ఆనందంగా ఉన్నారు. మార్కెట్‌లో మిర్చికి మంచి ధర పలకడంతో ఇదే సమయంలో విక్రయించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ధర అధికంగా ఉన్న చోటికి తమ పంటలను తరలిస్తున్నారు. మిర్చి గోల్డ్ రేట్‌ను మించి పోయింది.
మిర్చి రైతులు(Chilli Farmers) తమ నోట్లో చెరుకు రసం పడినంత ఆనందంగా ఉన్నారు. మార్కెట్‌లో మిర్చికి మంచి ధర(Red Chilli Rate) పలకడంతో ఇదే సమయంలో విక్రయించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ధర అధికంగా ఉన్న చోటికి తమ పంటలను తరలిస్తున్నారు. మిర్చి గోల్డ్ రేట్‌ను మించి పోయింది. మార్కెట్‌లో మంచి ధర పలకడంతో రాయలసీమ రైతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దేశంలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. గోల్డ్ రేట్‌ను క్రాస్ చేసింది. తులం బంగారం 50వేలు ఉంటే.. క్వింటా దేశీ మిర్చ 52వేలకు చేరుకుంది. ఇది దేశంలో రికార్డు ధర. గతంలో ఎన్నడూ లేని ఈ ధరను చూసి రైతులే షాక్ తింటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ రికార్డు ధరలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు క్వింటా 50 వేలు ఉన్న ధర ఒక్కసారిగా 52 వేలకు చేరుకుంది. ఇది దేశీయ మార్కెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ అంటున్నారు రైతులు. పంటను మార్కెట్‌కు తీసుకొస్తున్న రైతులు ధరలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పొలాల్లో ఉత్పత్తి తక్కువగా వచ్చినా.. ఈ రికార్డు ధరలను చూస్తున్న అన్నదాత కళ్లలో ఆనందం కనిపిస్తోంది.
అటు.. పత్తికి సైతం రికార్డు రేట్లు పలుకుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్‌లో తెల్ల బంగారానికి ఆల్ టైమ్ రికార్డు ధర పలుకుతోంది. క్వింటా పత్తి ధర 11వేలు దాటింది. ఇవాళ క్వింటా పత్తి ధర ఏకంగా 11వేల 2 వందలకు చేరింది. పక్కన ఉన్నమహారాష్ట్రలోని ధర్మబాద్ మార్కెట్‌లో 12వేలు పలుకుతోంది.
రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతుండడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతున్న ఈ సీజన్‌లో వస్తున్న తక్కువ దిగుబడితో రైతులు దిగులు చెందుతున్నారు. అటు.. పత్తి రైతులు మొత్తం సీజన్ మొదట్లోనే తక్కువ ధరకు సరుకును అమ్ముకోవడం జరిగింది.
ఇవి కూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఏసీ నుంచి ఎలుకను వేటాడిన భారీ పాము.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్..
Mamata Banerjee: ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై ఐక్యపోరాటం.. విపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమత పిలుపు..