AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని విజయశాంతి విజ్ఞప్తి

Telangana: ఓరుగల్లు గడ్డపై రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు (Rashtriya Sanskriti mahotsav) ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి..

Telangana: ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని విజయశాంతి విజ్ఞప్తి
Rashtriya Sanskriti Mahotsa
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2022 | 7:19 AM

Telangana: ఓరుగల్లు గడ్డపై రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు (Rashtriya Sanskriti mahotsav) ముగిశాయి. ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) …దేశ సంస్కృతి- సాంప్రదాయాలను, కళలను పరిరక్షించడం మన బాధ్యత అన్నారు. రామప్ప దేవాలయం (Ramappa Temple) తో పాటు వేయి స్తంభాల గుడికి కూడా పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ముగింపు వేడుకల్లో కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేత విజయశాంతి పాల్గొన్నారు. హనుమకొండ లోని ఆర్య అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహాత్సవాలు ముగిసాయి. తొలిరోజు ఆరంభ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిల సై సౌందర రాజన్ హాజరవగా.. ముగింపు వేడుకలకు కేంద్ర పర్యాటక- సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రెటరీ కవితా ప్రసాద్ ఇతర జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆత్మ శ్రీ పద్మజా రెడ్డి చేసిన కూచిపూడి నృత్యం అందర్నీ అలరించింది.ఈ మైదానంలో ఏర్పాటు చేసిన 80 క్రాఫ్ట్ స్టాల్స్‌ను మాజీ ఎంపీ సినీనటి విజయశాంతి సందర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఒసేయ్ రాములమ్మ సినిమాలోని పాడే సమయంలో స్టేజిపై ఆ సినిమాలో నటించిన విజయశాంతి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య ఇంటాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు, పద్మశ్రీ పద్మజా రెడ్డి, మందాడి సత్యనారాయణ రెడ్డి మోహన్ రెడ్డి ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పలువురు ప్రముఖులకు ముఖ్య అతిథులు మెమెంటోలు సన్మానాలు ప్రధానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ వరంగల్ గడ్డపై జరుగుతున్న ఈ సాంస్కృతిక మహోత్సవం ఎంతో అలరిస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు రేపటి తరానికి కూడా అందించాలని ఆమె అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెందిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఎంతో అలరించాయి అని విజయశాంతి అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు గడ్డ పౌరుషాల గడ్డ పై ఈ జాతీయ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించేందుకు ప్రధాని మోడీ అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది జానపద కళాకారులు ఒకేచోట ప్రదర్శనలివ్వడం సంస్కృతి, కళల గొప్పతనాన్ని చాటి చెప్పిందని అన్నారు. మన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చుకున్నామని, 3 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వ సహకారం తో కేంద్రం ఆ ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. కాకతీయ సామ్రాజ్యంలో వెయ్యి స్తంభాల గుడికి ఎలాంటి వైభవం ఉందో అటువంటి వైభవాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు. భద్రాద్రి, శ్రీశైలం, అన్నవరం, సింహాద్రి, బుద్ధ దేవాలయం సర్క్యూట్ గోల్కొండ కోటను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. అజాది కా అమృతోత్సవం భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య పండగను వచ్చే పంద్రాగస్టుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మూడు రంగుల జెండా ఎగర వేసుకొని ఘనంగా జరపాలని పిలిపునిచ్చారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పర్యాటక రంగం ఘనంగా జరుపుతుందని ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి వాడలో బస్తీల్లో గ్రామ మండలాల్లో ఘనంగా చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ ని అమృత్ సిటీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ గా గుర్తించి మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జాతీయ సంస్కృతి మహోత్సవాలు హైదరాబాద్ లో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పాటు సంగీత విభావరి కార్యక్రమంలో గాయని గాయకులు హేమచంద్ర, గీతామాధురి, ధనుంజయ, మధుప్రియ, మౌనిక దేశభక్తి, జానపద, భక్తి, సాహిత్య పాటలతో అందరినీ అలరించారు.

Also Read:

Gold And Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరసగా మూడో రోజు దిగివచ్చిన బంగారం ధర, స్థిరంగా వెండి

ఎల్కతుర్తిలో ధూంధాంగా BRS రజతోత్సవ సభ
ఎల్కతుర్తిలో ధూంధాంగా BRS రజతోత్సవ సభ
డెలివరీ అయిన గంటకే అగ్నికి ఆహుతైన కారు.. రూ.2.5 కోట్లు హాంఫట్..!
డెలివరీ అయిన గంటకే అగ్నికి ఆహుతైన కారు.. రూ.2.5 కోట్లు హాంఫట్..!
130 అణ్వాయుధాలు మీ వైపే ఎక్కుపెట్టాం..!
130 అణ్వాయుధాలు మీ వైపే ఎక్కుపెట్టాం..!
విమానంలో ఒక మహిళ బట్టలు విప్పి, సీటుపైనే..!
విమానంలో ఒక మహిళ బట్టలు విప్పి, సీటుపైనే..!
కాణిపాకం వెళ్తున్నారా.. సమీపంలో అర్ధక్షేత్రాన్ని సందర్శించండి..
కాణిపాకం వెళ్తున్నారా.. సమీపంలో అర్ధక్షేత్రాన్ని సందర్శించండి..
శనీశ్వరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి జీవితంలో రాజయోగమే
శనీశ్వరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి జీవితంలో రాజయోగమే
కిడ్నీస్టోన్స్, గాల్ స్టోన్స్‌తో ఇబ్బంది పడేవారికి ఈ మొక్క ఒక వరం
కిడ్నీస్టోన్స్, గాల్ స్టోన్స్‌తో ఇబ్బంది పడేవారికి ఈ మొక్క ఒక వరం
వీరిని నమ్మిన వారే ఎక్కువ మోసం చేస్తారట మీరున్నారా చెక్ చేసుకోండి
వీరిని నమ్మిన వారే ఎక్కువ మోసం చేస్తారట మీరున్నారా చెక్ చేసుకోండి
టమాటా కుర్మాని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.. రెసిపీ
టమాటా కుర్మాని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.. రెసిపీ
కర్ణుడు గురించి కృష్ణుడు చెప్పిన సుగుణాలు ఇవే నేటి తరానికి స్పూర్
కర్ణుడు గురించి కృష్ణుడు చెప్పిన సుగుణాలు ఇవే నేటి తరానికి స్పూర్