Gold And Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరసగా మూడో రోజు దిగివచ్చిన బంగారం ధర, స్థిరంగా వెండి
Gold And Silver Price Today ( March 31st 2022): కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో..
Gold And Silver Price Today ( March 31st 2022): కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే గడిచిన 10 రోజుల నుంచి పసిడి ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులు పెరిగితే.. మరో మూడు రోజులు నేల చూపులు చూస్తున్నది. వరసగా మూడో రోజు బంగారం రేటు తగ్గింది. బంగారం రేటు వరుసగా మూడో రోజు తగ్గడంం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే విషయం. ఒకప్పుడు భారతీయులు(Indians) తమ వద్ద ఉన్న బంగారంఎప్పుడైనా అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే.. తమను గట్టెక్కిస్తుందని భావించేవారు.. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. అయితే దేశీయంగా బంగారం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం.. బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు.. దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి.
భారతీయులు తమ జీవితంలో వచ్చే ప్రతి స్పెషల్ డే కి బంగారం, వెండి (gold and Silver) వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం కూడా ఓ స్టేటస్ గా భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో మార్చి 31 వ తేదీ 2022 గురువారం రోజున బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు:
హైదరాబాద్ లో నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న రూ. 47,750లు ఉండగా రూ .100 క్షీణించి నేడు రూ. రూ.47,650కు దిగొచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ. 52,100 లు ఉండగా నేడు రూ. 120 మేర తగ్గి 10 గ్రాములు రూ.51,980లుగా కొనసాగుతుంది.
ఇవే పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ తో పాటు, దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా ల్లో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరమైన చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,920 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,280గా ఉంది.
Silver Price: మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా బహుమతులు ఇవ్వడానికి వెండి వస్తువులను ఎంపిక చేసుకుంటారు.
ఓ వైపు దేశీయంగా బంగారం కొంతమేర దిగి వస్తే.. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.72,100. గత ఐదు రోజులుగా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. ఇంచుమించు ఇదే ధర తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించండి. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.
Also Read:
Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..