Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (31-03-2022): మనలో చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని ...  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా..

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2022 | 6:29 AM

Horoscope Today (31-03-2022): మనలో చాలా మంది రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని …  మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 31వ తేదీ ) గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారుమిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కలహాలకు దూరంగా ఉండడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పని తీరుకి ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా మంచి సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ముఖ్య వ్యవహారాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని వ్యవహారాల్లో దైర్యంగా వ్యవహరించాల్సి ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల తో సమన్వయంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఓర్పుగా నడుచుకోవడం మేలు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. మిశ్రమ కాలం ఉంటుంది. అప్పుల వలన ఒత్తిడి కలిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషకరంగా గడుపుతారు.  ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులు సమర్ధవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి  విందు, వినోద  కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. అనవసర ఒత్తిడి తగ్గించుకోవడం మేలు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతం చేసుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి విశేష లాభాలను అందుకుంటారు.   ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Vastu Tips: వాస్తు శాస్త్రం.. ఇంట్లో దేవుడి ఫోటోను ఈ దిశలో అంతా శుభప్రదమే..!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!