- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips keep the picture of god in this direction of the house is auspicious here are the details
Vastu Tips: వాస్తు శాస్త్రం.. ఇంట్లో దేవుడి ఫోటోను ఈ దిశలో అంతా శుభప్రదమే..!
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని పూజా స్థలం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రంలో దేవుని విగ్రహం, ఫోటో ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరమో పేర్కొనడం జరిగింది. మరి దేవుడి విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 31, 2022 | 6:00 AM

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోని పూజా స్థలం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రంలో దేవుని విగ్రహం, ఫోటో ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరమో పేర్కొనడం జరిగింది. మరి దేవుడి విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాన గణేశుడు, ఈశాన్యంలో దుర్గామాత చిత్రాన్ని ఉంచడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా బుదుడు స్థానం సానుకూలంగా మారుతుంది. బుద గ్రహం అదృష్టానికి కేరాఫ్‌గా చెబుతారు. బుదుడి అనుగ్రహం కలిగితే.. విద్య, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.

విష్ణువు, లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఈశాన్యంలో.. సాయిబాబా చిత్రాన్ని వాయువ్య దిశలో ఉంచాలి. విష్ణువు, సాయిబాబా లు బృహస్పతి శక్తిని పెంచుతారు. దీని కారణంగా జ్ఞానంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

హనుమంతుని చిత్రపటాన్ని ఆగ్నేయంలో ఉంచాలి. దీంతో బలం పెరిగి, ఆనందం పెరుగుతుంది. చంద్రుడు, శుక్రుడి శక్తిని పెంచే ఈశాన్య భాగంలో రాధా కృష్ణుడి చిత్రాన్ని ఉంచాలి. దీంతో ఆనందం, శాంతి పెరుగుతాయి.

శివుడు, పార్వతి దేవి విగ్రహం లేదా ఫోటో ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేయడం వలన చంద్రుని శక్తి పెరిగి.. ఇంట్లో సంతోషం పెరుగుతుంది.