Punjab CM: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. స్కూళ్లలో ఫీజుల పెంపుపై నిషేధం
పంజాబ్ (punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు సూళ్లల్లో ఫీజులు పెంచకుండా నిషేధం విధించారు. మరికొన్ని రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం...
పంజాబ్ (punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు సూళ్లల్లో ఫీజులు పెంచకుండా నిషేధం విధించారు. మరికొన్ని రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాకుండా తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ ప్రకటన చేయడానికి ముందే భగవంత్ మాన్ ఓ వీడియో(Video) సందేశం విడుదల చేశారు. అడ్మిషన్లు ప్రారంభం కానున్న వేళ ఏ ప్రైవేటు స్కూలూ ఫీజులు పెంచకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంతే కాకుండా బుక్స్, యూనిఫామ్(Uniform) వంటివి ఫలానా చోటే కొనుగోలు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేకూడదని వెల్లడించారు. తమకు నచ్చిన చోట కొనుగోలు చేసేలా పుస్తకాలు, యూనిఫామ్ దొరికే షాపుల వివరాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించారు.
ఇటీవలే.. పంజాబ్‌లో రేషన్ లబ్ధిదారులు రేషన్ కోసం ఇక నుంచి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని, నేరుగా వారి ఇంటి తలుపు వద్దకే రేషన్ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. డబ్బున్న వాళ్లు ఇంట్లో కూర్చొని అన్ని తమ వద్దకే తెచ్చుకుంటున్నారని, కానీ పేదలు మాత్రం రేషన్ దుకాణాల ముందు క్యూలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ వచ్చిందంటే ఇంటిని వదిలేసి క్యూలైన్లలోనే రోజు గడిచిపోతుందని చెప్పారు. వృద్ధులు కూడా రేషన్ కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారని, ఇక నుంచి పంజాబ్‌లోని లబ్ధిదారులందరినీ నాణ్యమైన రేషన్‌ను గిన్నీ బ్యాగుల్లో ప్యాక్ చేసి నేరుగా ఇంటి వద్దకే పంపిస్తామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 117 స్థానాలకు గానూ 92 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేసింది. దీంతో భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. తాజాగా విద్యా రంగంపై దృష్టి సారించారు.
Also Read
IPL 2022: ఈ సీజన్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన 8మంది బ్యాట్స్‌మెన్స్.. లిస్టులో రూ. 17 కోట్ల ఆటగాడు..
Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్ ఫొటోలు డిలీట్.. ఇందులో నిజమెంతంటే..