AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

RRR Movie: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) ల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్ఆర్‌ (RRR). దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మక తెరకెక్కించిన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది

Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..
Rrr Movie
Basha Shek
|

Updated on: Mar 30, 2022 | 6:11 PM

Share

RRR Movie: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) ల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్ఆర్‌ (RRR). దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మక తెరకెక్కించిన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతుండడంతో గతంలో ఏ భారతీయ సినిమాకు రానటువంటి కలెక్షన్లను సొంతం చేసుఉకంటోంది. మొదటి రోజే రూ.223 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. ఇప్పటివరకు రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ, ఎన్టీఆర్ ల అభినయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ సినిమాలో వీరితో పాటు బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ (Aliabhatt) సీత పాత్రలో సందడి చేసింది. రామ్‌చరణ్‌కు జోడీగా నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలైన తర్వాత స్క్రీన్‌ ప్రజెన్స్‌ విషయంలో అలియా అసంతృప్తిగా ఉందని.. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియాతో పోలిస్తే తన పాత్ర చాలా తక్కువగా ఉందని ఆమె ఫీలయ్యారనీ పుకార్లు షికార్లు చేశాయి. ఆ కోపంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌ నుంచి తొలగించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు తన ఇన్‌స్టా ఖాతా నుంచి రాజమౌళిని అన్‌ఫాలో చేశారన్న రూమర్లు బాగా హల్‌చల్‌ చేశాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదనిపిస్తోంది. ఎందుకంటే అలియా ఇన్‌స్టాఖాతాను పరిశీలిస్తే ఆమె మొత్తం 475 మందిని ఫాలో అవుతోంది. అందులో రాజమౌళితో సహా చెర్రీ, తారక్‌, నిర్మాత డీవీవీ దానయ్య ఉంటారు. అలాగే అలాగే ఆమె ఖాతాలో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్లు, ఫొటోలు, రాజమౌళితో సెట్స్‌లో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. సో.. అలియా రాజమౌళిని అన్‌ఫాలో చేసిందన్న వార్తలు, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు తొలగించిందన్న ఊహాగానాలు కేవలం కల్పితమేనని చెప్పవచ్చు.

Alia Bhatt

Also Read:Samsung Freestyle Projector: ఇంటిని థియేటర్‌గా మార్చేసే గ్యాడ్జెట్‌.. సామ్‌సంగ్‌ నుంచి అదిరిపోయే ప్రొజెక్టర్‌..

Brother and Sister: తమ్ముడిపై ప్రేమతో..! చనిపోయినా,బ్రతికించిన అక్క.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..

Upasana: శభాష్..! మెగా కోడలు అనిపించుకున్న ఉపాసన… అరుదైన గౌరవం సొంతం చేసుకున్న రామ్ చరణ్ భార్య..