AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brother and Sister: తమ్ముడిపై ప్రేమతో..! చనిపోయినా,బ్రతికించిన అక్క.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..

Brother and Sister: తమ్ముడిపై ప్రేమతో..! చనిపోయినా,బ్రతికించిన అక్క.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..

Anil kumar poka
|

Updated on: Mar 30, 2022 | 5:57 PM

Share

తన తమ్ముడి చేత కూతురి చెవులు కుట్టించే వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ఓ అక్క..గుర్రపు జట్కా బండిపై తమ్ముడిని కూర్చొబెట్టి, ఆట పాటలు, కోలాటాల మధ్య ఊరేగించింది. తమ్ముడి తనకున్న ప్రేమను పంచుకుంది. తన తమ్ముడే తన హీరో అని చాటిచెప్పింది అక్క ప్రియదర్శిని. అయితే...


తన తమ్ముడి చేత కూతురి చెవులు కుట్టించే వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ఓ అక్క..గుర్రపు జట్కా బండిపై తమ్ముడిని కూర్చొబెట్టి, ఆట పాటలు, కోలాటాల మధ్య ఊరేగించింది. తమ్ముడి తనకున్న ప్రేమను పంచుకుంది. తన తమ్ముడే తన హీరో అని చాటిచెప్పింది అక్క ప్రియదర్శిని. అయితే, ఇక్కడే ఓ అద్భుతమైన ట్విస్ట్ ఉంది.అదేంటంటే…తమిళనాడులో దిండిగల్ జిల్లాలోని ఒట్టన్‌ఛత్రంలో తన తమ్ముడి చేత కూతురి చెవులు కుట్టించే వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది అక్క ప్రియదర్శిని. గుర్రపు జట్కా బండిపై తమ్ముడిని కూర్చొబెట్టి ఆట, పాటలు, కోలాటాల మధ్య ఊరేగించింది. తమ్ముడు పాండీదురై పై ప్రేమను చాటుకుంది. తన తమ్ముడే తన హీరో అని చాటిచెప్పింది అక్క ప్రియదర్శిని. అయితే, ఇక్కడే అద్భుతమైన ట్విస్ట్ ఉంది.దిండిగల్ జిల్లాలోని ఒట్టన్‌ఛత్రంకు చెందిన పాండీదురై రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ మరణించాడు. అయితే తనకూతురి చెవులు కుట్టించే వేడుకను మేనమామ హోదాలో తమ్ముడు పాండీదురై ఒళ్ళో కూర్చోపెట్టి వేడుక గ్రాండ్ చేయాలని ప్లాన్ చేసింది అక్క ప్రియదర్శిని. పాండిదురై లేనిలోటు తెలియకుండా ఉండేందుకు సిలికాన్ విగ్రహం ఏర్పాటు చేసింది. ఊరంతా సంబరాలతో అంగరంగ వైభవంగా చెవులు కుట్టించే వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో తమ్ముడు లేని లోటే లేకుండా చేసింది అక్క ప్రియదర్శిని.

‘‘మేనమామ హోదాలో నా తమ్ముడు ఒళ్ళో కూర్చోపెట్టి నా కూతురికి సంబంధించిన అన్ని వేడుకలు జరిపించాలని అనుకున్నాను. కానీ నా తమ్ముడు చనిపోవడంతో మేము పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయాము. ఈ విధంగా మా తమ్ముడిని మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ మా సంతోషాన్ని మా తమ్ముడుతో పంచుకుంటున్నట్టే ఉంది.’’ అని ప్రియదర్శిని, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చనిపోయిన తన తమ్ముడు కోసం అక్క చేసిన ప్రయత్నం భళా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)