Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.
టైటానిక్ షిప్.. రియల్ స్టోరీపైన ఇప్పటికే పలు రీల్ స్టోరీలు కూడా వచ్చాయి. ఇది మునిగి ఇప్పటికీ.. సుమారు వంద ఏళ్లపైనే అవుతుంది. అయితే ఈ షిప్ ప్రమాదంపై ఇప్పటికే పలు సినిమాలు కూడా వచ్చాయి. 1912వ సంవత్సరంలో ఉత్తర అట్లాంటిక్‌లోని మంచుకొండను ఢీకొట్టి, సముద్రంలో మునిగిపోయింది..
టైటానిక్ షిప్.. రియల్ స్టోరీపైన ఇప్పటికే పలు రీల్ స్టోరీలు కూడా వచ్చాయి. ఇది మునిగి ఇప్పటికీ.. సుమారు వంద ఏళ్లపైనే అవుతుంది. అయితే ఈ షిప్ ప్రమాదంపై ఇప్పటికే పలు సినిమాలు కూడా వచ్చాయి. 1912వ సంవత్సరంలో ఉత్తర అట్లాంటిక్‌లోని మంచుకొండను ఢీకొట్టి, సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ షిప్. తర్వాత 1985లో ఆ షిప్‌కి సంబంధించిన అవశేషాలు అట్లాంటిక్ సముద్రంలో కనుగొనబడ్డాయి. ప్రమాదంలో 1500 మంది వరకు మరణించారు. ఇదిలా ఉండగా.. ఈ భారీ షిప్ వేల కిలోమీటర్ల సముద్రం కింద భాగంలో ఉంది. అయితే నీటి అడుగులో ఉన్న ఆ షిప్‌ను చూసేందుకు ఓ అవకాశం ఇచ్చింది ఓ సంస్థ. దీనికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.?అయితే ఇప్పుడు అసలు టైటానిక్‌ని చూడడానికి సొంత కళ్ళతో మిగిలిపోయిన శిధిలాలను సందర్శించడానికి నీటి అడుగున ప్రపంచం అన్వేషణకు అంకితమైన ఒక సంస్థ అవకాశం కల్పిస్తుంది. అయితే అందుకోసం ఒక్కరికి 1.25లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో..అక్షరాల 93లక్షల 15వేలు ఖర్చు అవుతుంది. సముద్రం ఉపరితలం నుండి సుమారు 12,467 అడుగుల ప్రయాణం ప్రయాణించి యాత్ర బృందం ఓషన్ గేట్ సబ్ ఉపయోగించి లోపలికి తీసుకుని వెళ్తుంది. టైటానిక్ సర్వే యాత్రలో భాగంగా.. ఎక్కువ మందికి లోతైన మహాసముద్రాలలోకి ప్రవేశించడానికి, మునిగిపోయిన షిప్‌లకు సంబంధించి పరిశోధనలు చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే.. సముద్రయాన శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు టైటానిక్ సముద్ర శాస్త్రవేత్తలతో యాత్రలో చురుకైన యాత్ర పాత్ర పోషించేలా వీలు కల్పిస్తుంది. బృందం దీనిని రాబోయే తరాల కోసం డాక్యుమెంట్ చేస్తుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

