IPL Rights: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం తీవ్రమైన పోటీ.. రూ. 45 వేల కోట్లపై కన్నేసిన బీసీసీఐ.. లిస్టులో బడా కంపెనీలు..
IPL Media Rights: ఐపీఎల్ సీజన్ 2023-2027 మీడియా హక్కుల కోసం బీసీసీఐ మంగళవారం టెండర్లు జారీ చేసింది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ-వేలం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2023-2027(IPL) మీడియా లేదా ప్రసార హక్కులను విక్రయించడం ద్వారా, BCCI ఖజానాకు రూ. 45,000 కోట్లు చేరనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈసారి మ్యాచ్‌ను టీవీతోపాటు OTT హక్కులను వేర్వేరుగా విక్రయించాలని బీసీసీఐ యోచిస్తోంది. స్టార్‌తో పాటు, అనేక కంపెనీలు IPL మీడియా హక్కులను కొనుగోలు చేయడానికి రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హక్కుల కోసం కొత్త పోటీని సృష్టించగలదని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం, IPL ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉన్నాయి. ఇది 2022 సీజన్‌తో ముగుస్తుంది. IPL తదుపరి 5 సీజన్ల మీడియా హక్కుల ద్వారా BCCI ఎన్ని వేల కోట్లు పొందనుంది, రేసులో ఏయే కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బీసీసీఐ ఐపీఎల్ మీడియా హక్కులకు సంబందించిన వేలానికి టెండర్‌ను జారీ చేసింది. BCCI IPL 2023 నుంచి2027 వరకు అంటే ఐదు సీజన్‌ల మీడియా హక్కుల కోసం టెండర్ (ITT)కు ప్రకటన జారీ చేసింది. మొదటిసారిగా IPL మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహిస్తు్న్నారు. జూన్ 12న ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ టెండర్లను మే 10 వరకు కొనుగోలు చేయవచ్చని బీసీసీఐ తెలిపింది. దీని కోసం నాన్-రిఫండబుల్ మొత్తం రూ. 25 లక్షలు + GST డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రెండు కొత్త జట్లు, మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా ఐపీఎల్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా అన్నారు.
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. దీనికి ముందు, సోనీ 2017 వరకు అంటే 10 సీజన్ల వరకు మీడియా హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకోసం సోనీ రూ.8,200 కోట్లు వెచ్చించింది. 2018లో ఈ హక్కులు మళ్లీ విక్రయించారు. ఈసారి BCCI దానికి దాదాపు రెట్టింపు ధరతో హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ స్పోర్ట్స్ 2018-2023కి అంటే ఐదేళ్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.16,347 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల పాటు మరోసారి విక్రయించనున్నారు. అయితే, ఈసారి బీసీసీఐ ఈ హక్కులను ఒక ప్యాకేజీకి బదులుగా నాలుగు ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించి విక్రయించనుంది. నాలుగు ప్రత్యేక ప్యాకేజీలలో హక్కులను విక్రయించడం ద్వారా, BCCI అనేక రెట్లు అధిక ధరను పొందుతుందని భావిస్తున్నారు. అలాగే దీనితో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఈ హక్కులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
నాలుగు ప్రత్యేక ప్యాకేజీలలో విక్రయించే ఛాన్స్..
ఈసారి BCCI IPL మీడియా హక్కులను నాలుగు ప్రత్యేక ప్యాకేజీలు లేదా బండిల్స్‌లో విక్రయించవచ్చని తెలుస్తోంది. అందులో టెలివిజన్, డిజిటల్ హక్కులు విడివిడిగా ఉంటాయని భావిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం మార్చి 25న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ హక్కులన్నీ ఒకే సంస్థ పొందేవి. వివిధ ప్యాకేజీలలో హక్కులను విక్రయించాలనే నిర్ణయాన్ని BCCI సలహా సంస్థ KPMGతో సంప్రదించి తీసుకుంది. దీని కింద, ప్యాకేజీ Aలో టెలివిజన్ హక్కులు ఉంటాయి. ప్యాకేజీ Bలో డిజిటల్ హక్కులు ఉంటాయి. అలాగే ప్యాకేజీ Cలో నాన్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కేటగిరీ (18 మ్యాచ్‌ల బండిల్), ప్యాకేజీ D ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రసార హక్కులను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అలాగే, ఈసారి బహుళ ప్రసారకర్తలు కన్సార్టియం ఏర్పాటు చేయడం ద్వారా OTT ప్లాట్‌ఫారమ్‌లో ఏకకాలంలో వేలం వేయడానికి అనుమతించరు. అంటే, ఇటీవల విలీనమైన సోనీ, జీ కలిసి వేలం వేసే అవకాశం ఉండదు. అయితే అవి విడివిడిగా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.
రూ. 45 వేల కోట్లకు విక్రయించే ఛాన్స్..
మీడియా నివేదికల ప్రకారం, IPL 2023-2027 ప్రసార లేదా మీడియా హక్కులను రూ. 35,000 కోట్ల వరకు విక్రయించే ఛాన్స్ ఉంది. అయితే నివేదికల ప్రకారం, BCCI అంచనా ప్రకారం, ఈ హక్కులు రూ. 40-50 వేల కోట్ల రూపాయల వరకు అమ్మేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంచనాల ప్రకారం – ఒక్క IPL టెలివిజన్ హక్కులు మాత్రమే రూ. 20 వేల కోట్లకు అమ్ముడవుతాయని అంచనా వేయగా, డిజిటల్ హక్కులు కూడా కనీసం అదే మొత్తంలో లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, హాట్‌స్టార్, సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల ఎంట్రీ కారణంగా డిజిటల్ మాధ్యమం ప్రజాదరణ వేగంగా పెరిగింది. OTT(అంటే ఓవర్ ది టాప్) డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కేబుల్, ఉపగ్రహా ప్రసారాలకు బదులుగా ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ వినియోగదారులకు అందించనుంది. హాట్‌స్టార్, సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, జీ ఫైవ్ లాంటి OTTకి ప్రస్తుతం టాప్‌లో ఉన్నాయి.
పోటీలో ఏ కంపెనీలు చేరనున్నాయి..
ప్రస్తుతం, స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కులను కలిగి ఉంది. అయితే ఇది రాబోయే 5 సీజన్ల బిడ్డింగ్‌లో చాలా పెద్ద కంపెనీలతో పోటీ పడబోతోంది. నివేదికల ప్రకారం, ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేయడానికి దేశ, విదేశాలలో చాలా కంపెనీలు రేసులో నిమగ్నమై ఉన్నాయి. స్టార్‌తో పాటు, సోనీ, జీ, మెటా (ఫేస్‌బుక్), అమెజాన్, యూట్యూబ్ (గూగుల్), రిలయన్స్ (వయాకామ్-18) వంటి దిగ్గజాలు ఈ హక్కులను కొనుగోలు చేసే రేసులో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా, టీవీలో అలాగే OTT వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో IPL చూసే ట్రెండ్ వేగంగా పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో, కొత్త మీడియా హక్కులలో టీవీ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా ఖరీదైనవిగా మారినట్లు BCCI భావిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో స్టార్స్ హాట్‌స్టార్, జీ ఫైవ్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ ఉన్నాయి. IPL మ్యాచ్‌ల డిజిటల్ ధరలను కొనుగోలు చేయడానికి ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లకు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
టాక్స్ ఫ్రీ..
ఐపీఎల్ ద్వారా వచ్చిన భారీ ఆదాయానికి బీసీసీఐ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నిజానికి, IPL ద్వారా దేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించడం కోసం, BCCI ఆదాయపు పన్ను సెక్షన్ 12A కింద IPL ఆదాయాలపై పన్ను చెల్లించకుండా మినహాయింపు ఉంది. 2016-17లో, ఐపీఎల్‌పై బీసీసీఐకి ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)కి విజ్ఞప్తి చేసింది. అయితే నవంబర్ 2021లో ఐటీఏటీ అప్పీల్‌ను తిరస్కరించి బీసీసీఐకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఐపీఎల్ మీడియా హక్కులు భారత క్రీడా బడ్జెట్ కంటే 15 రెట్లు ఎక్కువ?
2022-2023లో దేశ క్రీడా బడ్జెట్ రూ. 3062 కోట్లుగా ఉంది. అదే సమయంలో వచ్చే ఐదేళ్ల వరకు ఐపీఎల్ మీడియా హక్కులు దాదాపు రూ. 45 వేల కోట్లకు అమ్ముడుపోవచ్చని భావిస్తున్నారు. అంటే దేశ క్రీడా బడ్జెట్ కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఒక్క ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం దేశ మొత్తం క్రీడా బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ కానుంది.
రూ. 16 వేల కోట్లు ఖర్చు పెట్టిన స్టార్ స్పోర్ట్స్ ఎంత సంపాదించింది?
ఐపీఎల్ ప్రసార హక్కులపై రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించినా.. స్టార్ స్పోర్ట్స్ లాభాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు చూపించి డబ్బు ఎలా సంపాదిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. IPLని చూపించే కంపెనీలు రెండు మార్గాల్లో డబ్బు సంపాదిస్తాయి – ఒకటి ప్రకటనలు చూపడం ద్వారా, మరొకటి చందా(సబ్‌స్ర్కిప్షన్) ద్వారా. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లో 60 మ్యాచ్‌లు ఆడగా, 2022లో 8 నుంచి 10 జట్లకు పెరిగిన తర్వాత, మ్యాచ్‌ల సంఖ్య 74కి పెరిగింది. మ్యాచ్‌ని పెంచడం అంటే బ్రాడ్‌కాస్టర్ సంపాదన కూడా పెరుగుతుంది. నివేదికల ప్రకారం, స్టార్ ప్రతి IPL మ్యాచ్‌లో ప్రతి 10 సెకన్ల ప్రకటనకు రూ. 10-12 లక్షలు వసూలు చేస్తుంది. అంటే, ప్రతి సీజన్‌లో స్టార్ ప్రకటనల నుంచి భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. ఇది కాకుండా, హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను చూడటానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీని వార్షిక ఛార్జీ ప్రతి వినియోగదారుకు కనీసం రూ. 499గా ఉంది. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, IPL 2018లో, స్టార్ టీవీ, డిజిటల్‌లలో ప్రకటనలు, సభ్యత్వాల ద్వారా రూ. 2500 కోట్లు సంపాదించింది. అదే సమయంలో, స్టార్ సంపాదన 2021లో రూ. 5,200-5,300 కోట్లకు రెట్టింపు అయింది. రూ. 16 వేల కోట్లు ఖర్చు చేసినా స్టార్ మంచి లాభాలు ఆర్జించనుందనే భావిస్తున్నారు. ఐపీఎల్‌ను టెలివిజన్‌లో వీక్షించే వారి సంఖ్య అంటే ప్రతి సీజన్‌ను చూసే వారి సంఖ్య దాదాపు రూ.40 కోట్లకు చేరుకుంది. ఇది 2008 నుంచి నిరంతరం పెరుగుతూ వస్తోంది. 2019 తర్వాత, కరోనా యుగంలో ఇది కొంతవరకు తగ్గింది. అయితే ఇది మళ్లీ వేగం పుంజుకోవచ్చని భావిస్తున్నారు.
ప్రసార హక్కుల పరంగా ప్రపంచంలో IPL ఎక్కడ ఉంది?
అత్యంత ఖరీదైన ప్రసార హక్కుల పరంగా, ప్రపంచంలోని ఇతర స్పోర్ట్స్ లీగ్‌లతో పోలిస్తే IPL ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈ సందర్భంలో, అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) మొదటి స్థానంలో, ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ (EPL) రెండవది, మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB) మూడవది, IPL నాల్గవ స్థానంలో, జర్మనీకి చెందిన ఫుట్‌బాల్ లీగ్ బుండెస్లిగా 5వ స్థానంలో, అమెరికా నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) ఆరవ స్థానంలో ఉన్నాయి. విశేషమేమిటంటే, అత్యంత ఖరీదైన ప్రసార హక్కుల పరంగా, అగ్రస్థానంలో ఉన్న NFL 32 జట్లను కలిగి ఉంది. ప్రతి సీజన్‌లో 256 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఇప్పటివరకు IPLలో 8 జట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి సీజన్‌లో 60 మ్యాచ్‌లే జరిగాయి.
Also Read: IPL 2022: ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట చెత్త రికార్డ్.. లిస్టులో ఏ టీంలు ఉన్నాయంటే?
IPL 2022: జాతీయ జట్లు వద్దన్నా.. ఆహ్వానించిన ఐపీఎల్ టీంలు.. కట్ చేస్తే బౌలర్లపై భీభత్సం.. వారెవరంటే?