RCB vs KKR Highlights, IPL 2022 : ఉత్కంఠ మ్యాచ్ లో బెంగళూరు విజయం.. మరోసారి మెరిసిన డీకే..

Narender Vaitla

| Edited By: Basha Shek

Updated on: Mar 30, 2022 | 11:55 PM

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Live Score in telugu: ఐపీఎల్‌ టోర్నీలో బెంగళూరు మొదటి విజయం సాధించింది. బుధవారం రాత్రి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్ కతాను కట్టడి చేసిన బెంగళూరు ఆటగాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌ లోనూ రాణించారు

RCB vs KKR Highlights, IPL 2022 : ఉత్కంఠ మ్యాచ్ లో బెంగళూరు విజయం.. మరోసారి మెరిసిన డీకే..
Ipl Match

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Live Score in telugu: ఐపీఎల్‌ టోర్నీలో బెంగళూరు మొదటి విజయం సాధించింది. బుధవారం రాత్రి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్ కతాను కట్టడి చేసిన బెంగళూరు ఆటగాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌ లోనూ రాణించారు. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లో తలపడగా కేకేఆర్‌ 16, ఆర్సీబీ 13 మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇలా ఆర్సీబీ కంటే కేకేఆర్‌ బలంగా కనిపిస్తోంది. కేకేఆర్‌ టీమ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌లో పటిష్టంగా ఉండడం ఆ జట్టుకు బలంగా చెప్పొచ్చు. ఇటు ఆర్సీబీ విషయానికొస్తే ఈ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి, దినేష్‌ కార్తీక్‌లతో పటిష్టంగా ఉన్నప్పటికీ బౌలింగ్ అంశం మాత్రం ఆ జట్టును కలవరపెడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతాలు జరగనున్నాయి.? చివరికి గెలిచేదెవరో మరికాసేపట్లో తేలి పోనుంది.

బెంగళూరు: డుప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీష్‌ రానా, సౌథీ.

Key Events

కేకేఆర్‌దే ఆధిపత్యం..

ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లో తలపడగా కేకేఆర్‌ 16, ఆర్సీబీ 13 మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

కసిగా ఆర్సీబీ..

తొలి మ్యాచ్‌లో ఓటమి చవి చూసిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధించి, బోణీ కొట్టాలని కసితో ఉంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 30 Mar 2022 11:22 PM (IST)

    హోరాహోరీ మ్యాచ్‌లో బెంగళూరు విజయం..

    కోల్‌కతాతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 129 పరుగుల టార్గెట్‌ను నాలుగు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. రూథర్‌పర్డ్‌ (28) టాప్‌స్కోరర్‌గా నిలవగా, షెహ్‌బాజ్‌ అహ్మద్‌ (27), డేవిడ్‌ విల్లీ (18) తలా కొన్ని పరుగులు సాధించి జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.

  • 30 Mar 2022 11:09 PM (IST)

    రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్‌..

    కోల్‌కతా, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. 129 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ పరుగులు సాధిస్తున్నప్పటికీ.. కోల్‌కతా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. దీంతో విజయం కోసం ఇరుజట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 17.5 ఓవర్లలో 111/7.

  • 30 Mar 2022 10:39 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. షెహ్‌బాజ్‌ ఔట్‌..

    ఆర్సీబీ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతోన్న షెహ్‌బాజ్‌ అహ్మద్‌ ( 20 బంతుల్లో 27) వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దినేశ్‌ కార్తిక్‌ (1), రూథర్‌ పర్డ్‌ ( 28) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి ఇంకా 19 బంతుల్లో 24 పరుగులు అవసరం.

  • 30 Mar 2022 10:26 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. డేవిడ్‌ విల్లీని బోల్తా కొట్టించిన నరైన్‌..

    ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న డేవిడ్‌ విల్లీ (18) సునీల్‌ నరైన్‌ బోల్తా కొట్టించాడు. అతని స్థానంలో షెహ్‌బాజ్‌ అహ్మద్‌ క్రీజులోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు11.2 ఓవర్లలో 64/4.

  • 30 Mar 2022 10:13 PM (IST)

    నిలకడగా ఆర్సీబీ బ్యాటింగ్‌.. 50 పరుగులు దాటిన స్కోరు..

    129 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఓపెనర్లతో పాటు కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరును డేవిడ్‌ విల్లీ, షెర్ఫాన్‌ రూథర్‌ పర్డ్‌ ఆదుకున్నారు. సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 9 ఓవర్లలో 53/3. డేవిడ్‌ విల్లీ, రూథర్‌పర్డ్‌ చెరో 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. బెంగళూరు విజయానికి ఇంకా 66 బంతుల్లో 76 పరుగులు అవసరం.

  • 30 Mar 2022 09:43 PM (IST)

    ఆర్సీబీకి గట్టి దెబ్బ..

    ఆర్సీబీకి ఒక్కసారిగా కష్టాల్లోకి కూరుకుపోయింది. మూడు ఓవర్లు కూడా ముగియక ముందే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డుప్లెసిస్‌ అవుట్‌ కాగానే కోహ్లి కూడా ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో జాక్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 30 Mar 2022 09:34 PM (IST)

    ఆదిలోనే ఎదురు దెబ్బ..

    129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే తొలి దెబ్బ పడింది. అనుజ్‌ రావత్‌ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్లో జాక్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి రావత్‌ వెనుదిరిగాడు.

  • 30 Mar 2022 09:19 PM (IST)

    ముగిసిన తొలి ఇన్నింగ్స్‌..

    కేకేఆర్‌ అలవుట్‌ అయ్యింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలు పెట్టిన కేకేఆర్‌ తొలి నుంచి వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలోనే 18.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేయగలింది. జట్టులో ఆండ్రీ రస్సెల్ చేసిన 25 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. మిగత అంతా తక్కువ పరుగులకే పరిమితమయ్యారు.

  • 30 Mar 2022 08:54 PM (IST)

    100 పరుగులు..

    వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకుపోయిన కోల్‌కతా వంద పరుగుల మార్కును చేరుకుంది. 14.1 ఓవర్లలో వంద పరుగులను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్రీజులో ఆండ్రీ ఉమేష్‌ యాదవ్‌(1 ), టిమ్‌ సౌథీ ( 1) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 30 Mar 2022 08:25 PM (IST)

    కష్టాల్లోకి కోల్‌కతా..

    వరుస వికెట్లు కోల్పోతూ కేకేఆర్‌ కష్టాల్లోకి కూరుకుపోతోంది. షెల్డన్‌ జాక్సన్‌ అవుటయ్యాడు. హసరంగా బౌలింగ్‌లో జాక్సన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 30 Mar 2022 08:22 PM (IST)

    మరో వికెట్ గాన్..

    కోల్‌కతా మరో వికెట్‌ను కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో ఆకాశ్‌ డీప్‌కు క్యాచ్‌ ఇచ్చిన సునీల్‌ నరైన్‌ (12) పెవిలియన్‌ బాట పట్టాడు. కోల్‌కతా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 67 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 30 Mar 2022 08:09 PM (IST)

    నాలుగో వికెట్‌..

    వరుస వికెట్లు కోల్పోతు కేకేఆర్‌ కష్టాల్లోకి కూరుకుపోతోంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యార్‌ (13) కూడా అవుటయ్యాడు. హసరంగా బౌలింగ్‌లో బెంగళూరు కెప్టెన్‌ డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో కేకేఆర్‌ స్కోర్‌ ఒక్కసారిగా నెమ్మదించింది.

  • 30 Mar 2022 08:04 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌..

    కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోతోంది. క్రీజులోకి వచ్చిన మొదటి బంతినే సిక్సర్‌ బాదిన నితిన్‌ రానా అవుటయ్యాడు. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ విల్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు

  • 30 Mar 2022 07:56 PM (IST)

    రెండో వికెట్ గాన్‌..

    కేకేఆర్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. రహానే (09) సిరాజ్‌ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనతిరిగాడు.

  • 30 Mar 2022 07:46 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. వెంకటేష్‌ అయ్యర్‌ (10) ఆకాష్ దీప్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ ఎంట్రీ ఇచ్చాడు.

  • 30 Mar 2022 07:42 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న కేకేఆర్‌..

    కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్‌ కోల్పోకూడదనే లక్ష్యంతో ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అవసరమైతేనే షాట్స్‌కు ట్రై చేస్తూ మిగతా సందర్భాల్లో సింగిల్స్‌కు పరిమితమవుతున్నారు. ఆ క్రమంలోనే మూడు ఓవర్లకు ముగిసే సమయానికి కోల్‌కత పరుగుల 14 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో వెంకటేష్‌ అయ్యర్‌ ( 10), రహానే (3) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 30 Mar 2022 07:35 PM (IST)

    మొదటి ఓవర్‌ ముగిసే సమయానికి..

    టాస్‌ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన కేకేఆర్‌ మొదటి ఓవర్‌ ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వెంకటేష్‌ అయ్యర్‌ (03), రహానే (01) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 30 Mar 2022 07:18 PM (IST)

    జట్ల సభ్యులు..

    బెంగళూరు: డుప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

    కోల్‌కతా: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీష్‌ రానా, సౌథీ.

  • 30 Mar 2022 07:12 PM (IST)

    టాస్‌ గెలిచిన బెంగళూరు..

    ఆర్సీబీ, కేకేఆర్‌ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్‌ అయ్యింది. మరి ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

Published On - Mar 30,2022 7:08 PM

Follow us