ICC Rankings: కోహ్లీ, రోహిత్‌కు షాకిచ్చిన ఐసీసీ.. మరింత దిగజారిన స్థానాలు.. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజాదే అగ్రస్థానం..
Virat kohli: టెస్ట్, వన్డే ర్యాంకింగ్‌లను ICC విడుదల చేసింది. ఇందులో అనేక భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి టాప్ 10 నుంచి మరింత కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది.
టెస్ట్, వన్డే ర్యాంకింగ్‌లను ఐసీసీ( ICC) విడుదల చేసింది. ఇందులో అనేక భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టు ర్యాంకింగ్స్(ICC Rankings)లో ఉస్మాన్ ఖవాజా 6 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఉస్మాన్ ఖవాజా 757 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను ఉస్మాన్ ఖవాజా అధిగమించాడు.
- టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి టాప్ 10 నుంచి మరింత కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ కూడా ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు.
- ICC టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో, రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జాసన్ హోల్డర్ స్థానంలో ఆర్ అశ్విన్ రెండవ స్థానంలో నిలిచాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఆరో నంబర్ నుంచి ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. అదే సమయంలో కైల్ జేమ్సన్ ఆరో స్థానానికి పడిపోయాడు.
- వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్ టాప్ బ్యాట్స్‌మెన్ కాగా, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కానీ, రోహిత్ శర్మ ఐదో నంబర్ నుంచి నాలుగో నంబర్‌ను కైవసం చేసుకున్నాడు. బెయిర్‌స్టో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ రెండు స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలిచాడు.
- బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. అతను 8వ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఆడమ్ జంపా 6 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.