IPL 2022: జాతీయ జట్లు వద్దన్నా.. ఆహ్వానించిన ఐపీఎల్ టీంలు.. కట్ చేస్తే బౌలర్లపై భీభత్సం.. వారెవరంటే?

ఐపీఎల్ 2022లో షిమ్రోన్ హెట్మెయర్, భానుక రాజపక్సే తమ చురుకైన బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను వారి జాతీయ జట్టు అన్‌ఫిట్ అంటూ జట్టునుంచి తొలగించింది.

IPL 2022: జాతీయ జట్లు వద్దన్నా.. ఆహ్వానించిన ఐపీఎల్ టీంలు.. కట్ చేస్తే బౌలర్లపై భీభత్సం.. వారెవరంటే?
Ipl 2022 Bhanuka Rajapaksa, Shimron Hetmyer
Follow us

|

Updated on: Mar 30, 2022 | 3:01 PM

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫిట్‌నెస్ సంస్కృతి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోనే కాదు ఇప్పుడు ప్రతి క్రికెట్ టీమ్‌లోనూ ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కారణంగానే టీమిండియా ఆటతీరు మెరుగైంది. కానీ, ప్రశ్న ఏమిటంటే, ఫిట్‌నెస్ నిజమైన కొలత ఏమిటి? క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంటే మన కోటాలో పూర్తి ఓవర్‌లను మంచి రన్నింగ్‌లో బౌలింగ్ చేయడం, ఫీల్డింగ్ చేయడం, తుఫాన్ బ్యాటింగ్ చేయడమే, ఫిట్‌నెస్‌లో ఉన్నామని అంటుంటాం. కానీ, బహుశా కొన్ని జట్లు ఫిట్‌నెస్ కారణంగా తమ మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లను దూరం పెడుతున్నాయి. వెస్టిండీస్‌కు చెందిన షిమ్రాన్ హెట్‌మెయర్(Shimron Hetmyer), శ్రీలంకకు చెందిన భానుక రాజపక్సే(Bhanuka Rajapaksa) విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రాజపక్సే, హెట్‌మెయర్ ఇద్దరూ ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో టీమ్‌ల నుంచి తొలగించారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ 2022(IPL 2022) ప్రారంభ మ్యాచ్‌లలో, బ్యాట్‌తో రచ్చ చేసి, ఆకట్టుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న హెట్మెయర్, తన హిట్టింగ్ బలంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అలాగే పంజాబ్ కింగ్స్‌కు చెందిన భానుక రాజపక్స కూడా తన చురుకైన బ్యాటింగ్‌తో బెంగళూరు బౌలింగ్ దాడిని నాశనం చేశాడు.

రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హెట్మెయర్..

షిమ్రాన్ హెట్మెయర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. హెట్మెయర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 13 బంతులు ఆడాడు. ఇంత తక్కువ బంతుల్లో 32 పరుగులు చేసి రాజస్థాన్‌ను 210 భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. హెట్మెయర్ బ్యాట్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టాడు. ఆ సమయంలో స్ట్రయిక్ రేట్ 246గా ఉంది. హెట్మెయర్ ఇలాగే రాణిస్తే, అతను ఎలా అన్‌ఫిట్ అవుతాడు? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విధ్వంసం సృష్టించిన భానుక రాజపక్సే..

ఫిట్‌నెస్ దృష్ట్యా భానుక రాజపక్సను శ్రీలంక టీం నుంచి తొలగించింది. అయితే పంజాబ్ కింగ్స్ ఎడమచేతి వాటం ఆటగాడికి ప్లేయింగ్ XIలో చోటు కల్పించింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే భానుక ఆర్సీబీ బౌలర్లను చిత్తు చేశాడు. అతను 22 బంతుల్లో 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. రాజపక్సే ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను 206 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. రాజపక్సే, హెట్‌మెయర్‌ల ఆటతీరు చూస్తుంటే ఐపీఎల్ 2022లో కీలక ప్లేయర్లుగా మారే అవకాశం ఉంది.

Also Read: IPL 2022: కేన్ మామకు మరోషాక్.. ఆ విషయంలో రోహిత్ సరసన.. ఇదే రిపీటైతే ఇద్దరిపై వేటే?

IPL 2022: ఆ ఇద్దరూ బరిలోకి దిగితే ‌ఆర్‌సీబీకి చుక్కలే.. సిక్సర్లతో బౌలర్ల ఊచకోతే.!

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు