AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆ ఇద్దరూ బరిలోకి దిగితే ‌ఆర్‌సీబీకి చుక్కలే.. సిక్సర్లతో బౌలర్ల ఊచకోతే.!

ఇద్దరూ కొత్త కెప్టెన్లు.. ఒకరు గెలుపు కోసం ఆరాటపడుతుంటే.. మరొకరు విజయంతో జోరు మీదున్నారు.. ఎవరి గురించి చెబుతున్నానో..

IPL 2022: ఆ ఇద్దరూ బరిలోకి దిగితే ‌ఆర్‌సీబీకి చుక్కలే.. సిక్సర్లతో బౌలర్ల ఊచకోతే.!
Kkr Vs Rcb
Ravi Kiran
|

Updated on: Mar 30, 2022 | 12:56 PM

Share

ఇద్దరూ కొత్త కెప్టెన్లు.. ఒకరు గెలుపు కోసం ఆరాటపడుతుంటే.. మరొకరు విజయంతో జోరు మీదున్నారు.. ఎవరి గురించి చెబుతున్నానో ఈపాటికి అర్ధమై ఉంటుంది. అదేనండీ.. ఇవాళ ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల గత లెక్కలను పరిశీలిస్తే.. కేకేఆర్ జట్టే ఆర్సీబీపై పైచేయి సాధించింది. ఇప్పటివరకు ఈ టీమ్స్ తలబడిన మ్యాచ్‌లలో కేకేఆర్ 16 విజయాలు సాధిస్తే.. ఆర్సీబీ 13 విజయాలు నమోదు చేసింది.

ఇదిలా ఉంటే.. కేకేఆర్‌కు చెందిన ఇద్దరు ఆల్‌రౌండర్స్.. ఆర్సీబీ బౌలర్లను బెంబేలెత్తించారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.. బెంగళూరుపై వీరిద్దరి గత రికార్డు అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వారెవరో కాదు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్.. ఈ ఇద్దరూ 196.43, 215.12 స్ట్రైక్ రేట్‌తో ప్రతీసారి ఆర్సీబీ బౌలర్లపై తమ విశ్వరూపాన్ని చూపించారు. అలాగే కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతుండటంతో.. ఈ ప్లేయర్స్‌ను ఆర్సీబీ బౌలర్లు త్వరగా పెవిలియన్ పంపించాలి.

ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. డుప్లెసిస్‌, విరాట్ కోహ్లీకి కేకేఆర్‌‌పై మంచి రికార్డు ఉండగా.. మహమ్మద్ సిరాజ్‌కు చెత్త రికార్డు ఉంది. ఇక దినేష్ కార్తీక్ గతంలో కోల్‌కతా జట్టు తరపున ఆడిన అంశం ఆర్సీబీకి కలిసి రావచ్చు.

Also Read:

Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!

Viral Photo: ఈ ఫోటోలోని యంగ్ హీరో అమ్మాయిలకు లవర్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా?