AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆర్‌సీబీ బోణీ కొట్టేనా.? కోల్‌కతా జోరుకు కళ్లెం పడేనా.! ఢీ అంటే ఢీ..

ఐపీఎల్ 2022లో మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. డుప్లెసిస్ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో..

IPL 2022: ఆర్‌సీబీ బోణీ కొట్టేనా.? కోల్‌కతా జోరుకు కళ్లెం పడేనా.! ఢీ అంటే ఢీ..
Rcb Vs Kkr
Ravi Kiran
|

Updated on: Mar 30, 2022 | 9:15 AM

Share

ఐపీఎల్ 2022లో మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. డుప్లెసిస్ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలబడబోతోంది. ముంబైలోని డీవై స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి విజయం వరిస్తుందా.? కోల్‌కతా జోరుకు కళ్లెం పడుతుందా.? అనేది వేచి చూడాలి.

రెండు జట్ల బలాలు.. బలహీనతలు పరిశీలిస్తే..

ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్‌లు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో కూడా ఈ ముగ్గురు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడటంతోనే ఆర్సీబీ 200 స్కోర్ సాధించగలిగింది. మరోసారి ఈ ముగ్గురిపైనే టీం భారం పెట్టింది. ఇక బెంగళూరు బౌలర్లు ఫస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. గతేడాది పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హసరంగా తొలి మ్యాచ్‌లో దారళంగా పరుగులు సమర్పించుకోగా.. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో వారి ఫామ్‌పైనే ఆర్సీబీ విజయం ఆధారపడి ఉంది.

కోల్‌కతా విషయానికొస్తే.. చిన్న పొరపాట్లు మినహా.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కోల్‌కతా టీం బలంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ జట్టు టోర్నమెంట్‌ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. సీనియర్ ప్లేయర్ అజింక్యా రహనే తన ఫామ్‌ను తిరిగి రాబట్టుకోగా.. ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ హ్యాండీ రోల్స్‌తో మొదటి మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్‌లో సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధులను పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. దాదాపుగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కోహ్లీ, డుప్లెసిస్ మ్యాచ్ స్వరూపాన్ని తమవైపుకు ఎలా తిప్పుకుంటారో చూడాలి మరి.

బెంగళూరు(అంచనా): డుప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా(అంచనా): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Also Read:

Viral Video: రోడ్డు మీద సర్కస్ స్టంట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!