Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!

లంచం తీసుకోవడం ఒక ఆర్ట్.. ఊరికే అందరికీ కనిపించేటట్లు తీసుకోవడం.. ప్రతి మనిషిని గుడ్డిగా నమ్మడం.. అందరి మధ్యలో..

Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!
Traffic Police
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 28, 2022 | 1:19 PM

లంచం తీసుకోవడం ఒక ఆర్ట్.. ఊరికే అందరికీ కనిపించేటట్లు తీసుకోవడం.. ప్రతి మనిషిని గుడ్డిగా నమ్మడం.. అందరి మధ్యలో డబ్బులడగడం… ఏసీబీకి దొరికిపోవడం.. ఏంటండీ ఇది.. చిన్న పిల్లల్లాగా… లంచం తీసుకోవడం ఎలా ఉండాలంటే… ఇచ్చిన వాడు కూడా హే.. నేనిచ్చానా అసలు అని భ్రమ పడేలాగా ఉండాలి.. తీసుకున్నవాళ్లు కూడా హుహూ.. నే..నే.. నేను లంచాలు తీసుకుంటానా.. అని అనుకునేలా ఉండాలి.. కానీ డబ్బులు మాత్రం చేతులు మారిపోవాలి.. అదే.. జేబులు మారిపోవాలి.. తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకున్న విధానం చూస్తే మీరే షాక్ అవుతారు. అదీ అలా ఉండాలి.. లంచం అంటే… ఇలా తీసుకోవడం అంటే ఇలా ఉండాలి… ఎవ్వరికీ తెలియకుండా.. అంటూ మీరూ అనడం ఖాయం.

అరెరెరెరె…. సూపర్… అక్క ఎంత బాగా తీసుకుంటోందో… చూడండి సార్.. చూసి నేర్చుకోండి కొంచెం.. అలా రావాలి ఇలా పెట్టాలి… నువ్వటు నేనిటు… అంతే.. చాయ్.. తాగినట్టు .. ఏం సంగతి ఎలా ఉన్నారు మీరు… బాగున్నారా.. అని పలకరించుకుని వెళ్లినట్టు ఉండాలి.. అంతే.. అంతలోపే నా తప్పు మాఫీ అయిపోవాలి.. నీ లిస్ట్‌లో ఒక తప్పు పెరిగిపోవాలి.. మళ్లీ.. ఏ ఏం కాలేదు. ఏం కాలేదు… అంతా బాగానే ఉంది.. సూపర్… హేయ్.. అసలే శాంతి భద్రతలు కాపాడే ఆఫీసర్లం… కనిపించే మూడు సింహాలు.. దేనికో దేనికో దేనికో ప్రతిరూపాలయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా.. అబ్బా దగ్గొసత్ఓందండీ.. ఇవన్నీ ఆ అక్క డైలాగులు. మీకు నువ్ నాకు నచ్చావ్ సినిమా గుర్తుంది కదా.. అందులో రైల్వే స్టేషన్ సీన్… వెంకటేష్ బయటకు వస్తూ అంటూ ఉంటాడు.. అన్ని రూల్స్ మాట్లాడాడు.. పైనుండి వంద దొబ్బాడు.. అన్నట్లు… అదిదే.. కానీ పైనొకడుంటాడు .. మొత్తం తతంగాన్ని చూశాడు.. వీడియో తీశాడు.. సోషల్ మీడియోలో ఎక్కించాడు.. ఆమెను ఇంట్లో సస్పెండ్ చేసి కూర్చోపెట్టాడు.. వావ్..హుహు.. అక్కది పుణె.. మీరెప్పుడైనా పుణె వెల్తే… ముందు ఆమె జేబులో డబ్బులు పెట్టి మాట్లాడండి.. ఓకేనా.. మరి లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి..

Also Read:

Viral Video: ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Andhra Pradesh: చేపల కోసం వల విసిరితే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా కళ్లు చెదిరే సీన్!