Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

పెట్రో ధరల మంటతో చాలామంది ఈ మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లుతున్నారు. నిజమే కదా.. వందదాటింది పెట్రోల్‌. ఆ మంట భరించే..

Viral Video: ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Electric Bike
Follow us
Ravi Kiran

| Edited By: Ganesh Mudavath

Updated on: Mar 27, 2022 | 9:26 AM

పెట్రోల్ ధరల మంటతో చాలామంది ఈ మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లుతున్నారు. నిజమే కదా.. వందదాటింది పెట్రోల్‌. ఆ మంట భరించే బదులు.. పవర్‌ఛార్జీలతో నెట్టుకురావచ్చని ఈవీ వెహికిల్స్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. ఆగండాగండి.. అందులోనూ కొన్ని లోపాలుంటాయి. జాగ్రత్త వహించకుంటే డేంజర్‌ తెలుసా.. ఎలా అంటారా.. చూడండి

ఇదిగో ఇక్కడ చూశారా.. ఈవీ స్కూటర్‌ ఛార్జింగ్‌ పెట్టారు. అది కూడా ఇంట్లోనే పెట్టాడో వ్యక్తి. ఈవే కదా ఏమవుతుందిలే అనుకున్నాడు.. కానీ ఇదిగో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. నెమ్మదిగా అందులోంచి మంటలు రావడం మొదలయ్యాయి.. ఆ సౌండ్‌కు వెంటనే ఆ ఇంటి యజమాని దాన్ని ఆపేద్దామనుకున్నాడు. మంటలు ఎక్కువగా కావడంతో కుదరలేదు.. బయటకు వెళ్లి పవర్‌ ఆఫ్‌ చేద్దామనుకున్నాడు..

అందుకోసం ఆయన పడ్డ పాట్లు అంతా ఇంతా కాదు.. మరోసారి ఈవీ వెహికిల్‌ దగ్గరికి వెళ్లి ఆపేద్దామని చూశాడు.. అది పేలడంతో.. మంటల తాలూకు నిప్పురవ్వలు మీద పడడంతో.. అయ్యో అనుకున్నంత పనైంది. కానీ జస్ట్‌మిస్‌. వెంటనే లేచి.. వపర్‌ ఆఫ్‌ చేసేలా చేశాడు. ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టడం అంత ఉత్తమం కాదు.. ముప్పు తప్పినప్పటికీ.. ఈవీతోనూ డేంజరేనన్న అభిప్రాయం మాత్రం వణుకుపుట్టిస్తోంది.

Also Read: 

Viral Video: ద్యావుడా! మరీ ఇంత మతిమరుపా.. ఈ యువతి చేసిన పని చూస్తే మైండ్ బ్లాంకే!

Andhra Pradesh: చేపల కోసం వల విసిరితే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా కళ్లు చెదిరే సీన్!