- Telugu News Photo Gallery Technology photos Samsung launches new projector samsung Samsung Freestyle Projector features and price
Samsung Freestyle Projector: ఇంటిని థియేటర్‌గా మార్చేసే గ్యాడ్జెట్.. సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే ప్రొజెక్టర్..
Samsung Freestyle Projector: కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవారికంటే ఇంట్లో చూసే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఓటీటీ, ప్రొజెక్టర్లు, పెద్ద స్క్రీన్‌లు ఉన్న టీవీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా సామ్‌సంగ్ ఫ్రీస్టైల్ పేరుతో ఓ ప్రోజెక్టర్‌ను లాంచ్ చేసింది...
Updated on: Mar 30, 2022 | 6:05 PM

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండడంతో ఇంటిలో హోం థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో టాప్ కంపెనీలు సైతం ప్రొజెక్టర్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా సామ్‌సంగ్ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రొజెక్టర్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..

దాదాపు మనం చూసే అన్ని ప్రొజెక్టర్లు బాక్స్ ఆకారంలో ఉంటాయి. కానీ ఈ ప్రొజెక్టర్‌ను మాత్రం విభన్నంగా రూపొందించారు. కేవలం ప్రొజెక్టర్‌గానే కాకుండా అవసరమైనప్పుడు ఈ ప్రొజెక్టర్‌ను స్మార్ట్ స్పీకర్‌గా మార్చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఈ ప్రొజెక్టర్ సహాయంతో 30 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వరకు వీడియోలను ప్లే చేసుకోవచ్చు. 180 డిగ్రీల రొటేషన్‌తో ప్రొజెక్టర్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ బరువు కేవలం 800 గ్రాములే కావడం విశేషం.

ఈ ప్రొజెక్టర్ ద్వారా నేరుగా అన్ని రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్ ద్వారా వీడియోలు ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను మిర్రర్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్‌లో ఆపరేట్ చేసే ప్రతీదీ స్క్రీన్‌పై కనిపిస్తుందన్నమాట.

ఈ ప్రొజెక్టర్‌లో ఉన్న వాయిస్ కంట్రోల్ ద్వారా కావాల్సిన కంటెంట్‌ను వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ధర విషయానికొస్తే ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో రూపొందించిన ఈ ఫీచర్ రూ. 84,990కి అందుబాటులో ఉంది. అమెజాన్, సామ్‌సంగ్‌తో పాటు అన్ని రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.





























