- Telugu News Photo Gallery Technology photos Microblogging site twitter introduced new feature for ipl score updates and live
Twitter IPL: ఐపీఎల్ లవర్స్ కోసం ట్విట్టర్ కొత్త ఫీచర్.. లైవ్ అప్‌డేట్స్‌తో పాటు మరెన్నో..
Twitter IPL: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ లవర్స్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంతో ఆసక్తికగా వీక్షిస్తున్నారు. ఇలాంటి క్రికెట్ అభిమానుల కోసమే ట్విట్టర్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు...
Updated on: Mar 31, 2022 | 5:11 PM

భారతీయులను, క్రికెట్‌ను వేరు చేసి చూడలేం. క్రికెట్ అంటే ఇండియన్స్‌కు ఎక్కడలేని ఆసక్తి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఐపీఎల్ సీజన్‌కు భారత్‌లో ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకొనే ట్విట్టర్ ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ట్విట్టర్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు పుష్ నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌ల వివరాలత పోటు లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

కేవలం స్కోర్ వివరాలే కాకుండా లేటెస్ట్ ఐపీఎల్ మ్యాచ్ల వివరాలు, స్కోర్ కార్డుల వివరాలను అందిస్తుంది. ఎక్స్‌ప్లోర్ పేజీలో ఉండే క్రికెట్ టాబ్‌ను క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను లైవ్‌లో చూడొచ్చు.

టీమ్ విడ్జెట్స్‌లో టాప్ ప్లేయర్స్, జట్టు ర్యాంకింగ్‌లు, అత్యధిక స్కోర్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతుండగానే ఈ ర్యాంకింగ్ వివరాలు అప్‌డేట్ అవుతుంటాయి.

కేవలం డేటాకే పరిమితం కాకుండా క్రికెట్‌కు సంబంధించి వీడియోలను తీసుకొచ్చేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోంది. ముఖ్యమైన ఈవెంట్స్, హైలెట్స్, కీలకమైన మూమెంట్స్ లాంటివి షార్ట్ వీడియోల రూపంలో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.





























