స్నేహితుడి ఎడబాటును తట్టుకోలేక.. అతని జ్ఞాపకాల్లో జీవించలేక.. ఆఖరుకు

స్నేహం (Friendship) ఎంతో గొప్పదని అంటుంటారు. అయితే ఆ స్నేహం లోతెంతో తెలుసుకోవాలంటే మాత్రం అలాంటి స్నేహితం ఏర్పరుచుకోవాలి. కుటుంబసభ్యుల కంటే స్నేహితుల వద్దే మన విషయాలన్నీ పంచుకుంటాం. ఇద్దరి ఆలోచనలు కలిస్తే...

స్నేహితుడి ఎడబాటును తట్టుకోలేక.. అతని జ్ఞాపకాల్లో జీవించలేక.. ఆఖరుకు
Friend Suicide
Ganesh Mudavath

|

Mar 30, 2022 | 7:46 PM

స్నేహం (Friendship) ఎంతో గొప్పదని అంటుంటారు. అయితే ఆ స్నేహం లోతెంతో తెలుసుకోవాలంటే మాత్రం అలాంటి స్నేహితం ఏర్పరుచుకోవాలి. కుటుంబసభ్యుల కంటే స్నేహితుల వద్దే మన విషయాలన్నీ పంచుకుంటాం. ఇద్దరి ఆలోచనలు కలిస్తే వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన బంధం రానురాను బలంగా మారుతుంది. తాజాగా గుంటూరు జిల్లాలో ప్రాణానికి ప్రాణంగా ఉండే ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహితుడు లేని లోకంలో తాను జీవించలేనంటూ తనువు చాలించాడు.(Suicide) ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ప్రత్తిపాడు(Prathipadu) మండలంలోని అబ్బినేని గుంటపాలెం గ్రామానికి చెందిన విజయ్, కాకుమాను మండలంలోని గార్లపాడులో నివాసముండే బాలరాజు ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఫైనలియర్ లో ఉన్నారు. అయితే మూడు రోజుల వ్యవధిలో స్నేహితులిద్దరూ బలవన్మరణానికి పాల్పడటం అందరిని కంటతడి పెట్టిస్తోంది. విజయ్, బాలరాజు మధ్య మంచి స్నేహం ఉంది. ఎక్కడికీ వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. మూడు రోజుల క్రితం బాలరాజు ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో జరిగిన వివాదాలతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు.

ప్రాణమిత్రుడు బాలరాజు చనిపోవటాన్ని విజయ్ జీర్ణించుకోలేకపోయాడు. బాలరాజు మృతి గురించి విజయ్.. తన తండ్రి మోషేకు చెప్పి బాధపడ్డాడు. కుమారుడి బాధను చూసి తండ్రి మోషే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మొదట విజయ్ కొంత కుదుటపడినట్లు అందరూ భావించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని వెళ్లిన విజయ్ తిరిగి ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతని కోసం వెతకారు. ఈ క్రమంలో కాటూరి వారి చెరువు వద్ద శవమై కనిపించాడు. చీరతో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. స్నేహితుడి లేని లోకంలో తానుండలేనని భావించి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరూ స్నేహితులు చనిపోవటంతో గ్రామంలో, కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    – టి.నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

Also Read

Kurnool: ఏపీలోని ఆ జిల్లాలో కరోనా ఖేల్‌ ఖతం.. సున్నాకు చేరుకున్న యాక్టివ్‌ కేసులు..

Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Upasana: శభాష్..! మెగా కోడలు అనిపించుకున్న ఉపాసన… అరుదైన గౌరవం సొంతం చేసుకున్న రామ్ చరణ్ భార్య..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu