AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

Prabhas: బాహుబలి (Bahubali) కారణంగా సినిమాల్లో వేగాన్ని తగ్గించిన ప్రభాస్‌.. ప్రస్తుతం ఆ లోటును తీర్చాలనే ఉద్దేశంతో వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వరుసలో వచ్చించే రాధేశ్యామ్‌ (RadheShyam). ఇక ప్రస్తుతం ప్రభాస్‌ తర్వాతి చిత్రంపై...

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?
Prabhas Salar Movie
Narender Vaitla
|

Updated on: Mar 30, 2022 | 3:22 PM

Share

Prabhas: బాహుబలి (Bahubali) కారణంగా సినిమాల్లో వేగాన్ని తగ్గించిన ప్రభాస్‌.. ప్రస్తుతం ఆ లోటును తీర్చాలనే ఉద్దేశంతో వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వరుసలో వచ్చించే రాధేశ్యామ్‌ (RadheShyam). ఇక ప్రస్తుతం ప్రభాస్‌ తర్వాతి చిత్రంపై అందరి దృష్టి పడింది. ప్రభాస్‌ లైనప్‌లో ఉన్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌వి కావడంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ చూపు వాటిపై పడింది. ఇప్పటికే ఆదిపురుష్‌, సలార్‌, మారుతి దర్శకత్వంలో సినిమా, నాగ అశ్విన్‌తో ప్రాజెక్ట్‌కే, సందీప్‌ వంగతో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్‌ తర్వాతి చిత్రాల జాబితా చాలా పెద్దగా ఉంది. అయితే వీటన్నింటిలో ముందుగా సలార్‌ వస్తుందని అందరూ ఊహించారు.

కానీ ఈ సినిమా అనుకున్న సమయానికంటే ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రభాస్‌ షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వడమే. రాధేశ్యామ్‌ సినిమా సమయంలో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత సర్జరీ కోసం ప్రభాస్‌ విదేశాలకు వెళ్లారు. దీంతో ప్రభాస్‌ కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టేలా ఉంది. ఈ కారణంగానే ప్రభాస్‌ సలార్‌ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో సహజంగానే సలార్‌ సినిమా విడుదలపై ప్రభావం పడనుంది.

కేజీఎఫ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తమ అభిమాన హీరోను చూసుకోవాలని భావించిన డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు మరికొన్ని రోజులు ఎదురు చూపులు తప్పవన్నమాట. ఇప్పటి వరకు సలార్‌ 60 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. అందులోనూ షూటింగ్‌కు ఇలా బ్రేక్‌లు పడుతుండడంతో సినిమా వచ్చే ఏడాది చివరికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Health Tips: ఈ ఆహారాలను తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. పుష్కలంగా విటమిన్స్‌..!

Breaking! టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఎప్పుడు?.. ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు..

London Hyderabad Restaruant: లండన్‌లోని హైదరాబాద్‌ రెస్టారెంట్‌లో భారతీయ విద్యార్థినిపై కత్తితో దాడి..!