AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

RRR Movie: దేశమంతా ట్రిపులార్‌ సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వ పనితీరు, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ల (Ram Charan) నట విశ్వరూపం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Ntr Rrr Movie
Narender Vaitla
|

Updated on: Mar 30, 2022 | 4:55 PM

Share

RRR Movie: దేశమంతా ట్రిపులార్‌ సినిమా హవా నడుస్తోంది. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వ పనితీరు, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ల (Ram Charan) నట విశ్వరూపం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధులకు తనదైన కాల్పనికతను జోడించి జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు మంచి మార్కులు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఇద్దరు హీరోల గురించి మాట్లాడుకుంటున్నారు.

సినిమా గ్రాండ్ సక్సెస్‌ కావడంతో చిత్ర యూనిట్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘నటుడిగా నేను ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నా నుంచి ఎంతో శ్రమ కోరుకుంది. ఇది నాకు ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. ట్రిపులార్‌ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఇకపై నా కెరీర్‌ గురించి మాట్లాడాలంటే.. అందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకొంటారు’ అని తెలిపారు ఎన్టీఆర్‌.

ఇక సినిమా కలెక్షన్ల విషయమై తనదైన శైలిలో స్పందించారు ఎన్టీఆర్‌. ‘నా దృష్టిలో సినిమా విజయాన్ని నిర్ధేశించేవి మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, చివరిగా కలెక్షన్లు. ఎందుకంటే కలెక్షన్స్‌తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే.. నంబర్స్‌ పెరిగితే.. నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంద’ని చెప్పుకొచ్చారు యంగ్‌ టైగర్‌.

Also Read: AUS vs WI: సెమీస్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఉమెన్స్.. 9వసారి ఫైనల్‌ పోరుకు.. ట్రోఫీ లిస్టులోనూ అగ్రస్థానమే..

బ్యాంకు మోసాలు, కుంభకోణాలతో రోజుకు రూ.100 కోట్ల నష్టం.. RBI రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్ విషయాలు

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్