AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకు మోసాలు, కుంభకోణాలతో రోజుకు రూ.100 కోట్ల నష్టం.. RBI రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్ విషయాలు

దేశంలో ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల్ని బురిడీ కొట్టిస్తున్న బడాబాబుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోట్లకు కోట్లు ముంచేస్తూ.. నయా కుంభకోణానికి తెరదీస్తున్నారు.

బ్యాంకు మోసాలు, కుంభకోణాలతో రోజుకు రూ.100 కోట్ల నష్టం.. RBI రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్ విషయాలు
Representative ImageImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Mar 30, 2022 | 1:58 PM

Share

RBI News: దేశంలో ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల్ని బురిడీ కొట్టిస్తున్న బడాబాబుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోట్లకు కోట్లు ముంచేస్తూ.. నయా కుంభకోణానికి తెరదీస్తున్నారు. RBI తాజా నివేదికలో వెలుగుచూసిన సంచలన విషయాలు అందర్నీ నివ్వెరపరుస్తున్నాయి. బ్యాంకు మోసాలు, కుంభకోణాల(Bank Frauds and Scams)పై ఆర్బీఐ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది రూపాయల కుంభకోణం బ్యాంకుల్ని దివాళా తీయిస్తోంది. వరుస కుంభకోణాలతో భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి బ్యాంకులు. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. గత ఏడు సంవత్సరాల నుంచి బ్యాంకు మోసాలు లేదా కుంభకోణాలతో భారత్‌ రోజుకు కనీసం రూ.100 కోట్లు కోల్పోతోంది. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 50 శాతం నగదును ఇక్కడే కోల్పోతుండటం విస్తుగొలిపే అంశం. మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకూ రూ.2.5 లక్షల కోట్ల విలువైన బ్యాంకు మోసాలను గుర్తించారు. 2015-16లో రూ.67,760 కోట్లు, 2016-17లో రూ.59,9664.4 కోట్లు, 2017-18, 2018-19 రెండేళ్లలో రూ.45 వేల కోట్లు, 2019-20లో రూ.27,698.4 కోట్లు, 2020-21 సంవత్సరంలో రూ.10,699.9 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో రూ.34,097 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయి. ఈ మోసాలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఈ మోసాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. నివారణ చర్యల ఫలితంగానే ఏటికేడు ఆర్థిక మోసాల విలువ తగ్గుతూ వస్తోందని స్పష్టం చేసింది.

మొత్తంగా 27 కమర్షియల్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు. ఈ సంస్థల్లో 96 మోసాలు జరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో 4,820 కోట్ల మోసంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ముందు వరుసలో ఉంది. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో 13 ఆర్థిక మోసాలు జరిగాయి. యెస్‌ బ్యాంకు 3,869, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3,902, కెనరా బ్యాంకు 2,658 కోట్లు నష్టపోయాయి.

Also Read..

Viral Video: రోడ్డుమీద కొట్టుకున్న ఓ యువతి, ఇద్దరు యువకులు.. నెట్టింట్లో వీడియో వైరల్

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. హైకోర్టుకు 800 పేజీల నివేదిక..