AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డుమీద కొట్టుకున్న ఓ యువతి, ఇద్దరు యువకులు.. నెట్టింట్లో వీడియో వైరల్

Viral Video: ఓ అమ్మాయి రోడ్డు మీద పట్టపగలు ఎవరిని పట్టించుకోకుండా ఓ ఇద్దరు యువకులను  కొడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ (Social Media) అవుతుంది. ఈ ఘటన ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌..

Viral Video: రోడ్డుమీద కొట్టుకున్న ఓ యువతి, ఇద్దరు యువకులు.. నెట్టింట్లో వీడియో వైరల్
Young Girl, Two Boys Fight
Surya Kala
|

Updated on: Mar 30, 2022 | 1:28 PM

Share

Viral Video: ఓ అమ్మాయి రోడ్డు మీద పట్టపగలు ఎవరిని పట్టించుకోకుండా ఓ ఇద్దరు యువకులను  కొడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ (Social Media) అవుతుంది. ఈ ఘటన ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌ (Bhubaneswar) లోని ఐజి పార్క్ సమీపంలోని చోటు చేసుకుంది. ఒక యువతి , ఇద్దరు అబ్బాయిలు పట్టపగలు ఎవరినీ పట్టించుకోకుండా పోట్లాడుకోవడం రహదారి గుండా వెళుతున్న ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు.  వైరల్‌గా మారిన వీడియోలో.. బాలిక మొదట రోడ్డు పక్కన తనకు తెలిసిన యువకుడితో తీవ్ర వాగ్వాదం చేసింది. అనంతరం హఠాత్తుగా పక్కన స్కూటీపై కూర్చున్న యువకుడిని కొట్టడం, తిట్టడం ప్రారంభించింది. అంతేకాదు అతనిపై రాళ్లు కూడా రువ్వింది.

ఈ ఘటనను కెమెరాల్లో బంధించడానికి మీడియా సహా పలువురు ప్రయత్నించారు. అయితే అప్పుడు ఆ అమ్మాయి మీడియా వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. తర్వాత అమ్మాయి తీరుని అక్కడ ఉన్న కొంతమంది నిరసిస్తూ.. ఇలా అమ్మాయి ప్రవర్తించడం సరికాదని చెప్పారు. దీంతో ఆ యువతికి విపరీతమైన కోపం వచ్చి.. తనకు సలహా చెప్పిన వారిపై, అక్కడ చూస్తున్న వారి దగ్గర అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు తీవ్ర అసభ్య వ్యాఖ్యలతో దూషించింది.

తాను గొడవ పడుతున్న సమయంలో వీడియో తీస్తున్న ఓ యువకుడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. అంతేకాదు.. ఆగ్రహంతో ఆ యువకుడిపై దాడి చేస్తూ.. అసభ్యపదజాలంతో దూషించింది. అయితే అబ్బాయి కూడా ఆ యువతిని తిరిగి కొట్టాడు.

అనంతరం సమాచారం అందుకున్న భువనేశ్వర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువతిని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు. ప్రేమ వ్యవహారమే యువతి, యువకుల మధ్య గొడవకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

Also Read: Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..

Puri Jagannath: చిరుతో నా ప్రాజెక్ట్ అందుకే ఆగిపోయింది.. మనసులో మాట బయట పెట్టిన పూరీ జగన్నాథ్