Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..
Ugadi 2022: తెలుగువారికి కొత్త సంవత్సరం (Telugu New Year) ఉగాది పర్వదినంతో ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం(Chaitra Maas) వసంత ఋతువు..
Ugadi 2022: తెలుగువారికి కొత్త సంవత్సరం (Telugu New Year) ఉగాది పర్వదినంతో ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం(Chaitra Maas) వసంత ఋతువు కాలంలో ఉగాదిని జరుపుకుంటాము. ఉగాదితోనే పండగలు మొదలవుతాయి. ఈ ఏడాది ఉగాది పర్వదినం శుభకృత్ నామ సంవత్సరంగా ఏప్రిల్ 2వ తేదీన జరుపుకోనున్నాము. అయితే ఈ పండుగ రోజున మనిషి ఎంత జీవితాన్ని ఏ విధంగా గడుపుతాడో.. ఏడాది పొడవునా అదే విధంగా జరుగుతుందని పెద్దల నమ్మకం. అందుకనే ఉగాది పర్వదినం రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలనీ చెప్పారు.
- ఉగాది పండుగ రోజున తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలని సుచినారు. తలకు నూనె పెట్టుకుని, మన శరీరానికి నూనె రాసుకుని.. నలుగు పిండి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి.
- అనంతరం తప్పని సరిగా కొత్త దుస్తులు ధరించాలి.
- ఇష్టదైవాన్ని పూజించి ప్రసాదంగా ఉగాది పచ్చడిని తినాలి. ఇలా ఉగాది రోజున ఉగాది పచ్చడితో రోజుని మొదలు పెట్టాలి.
- సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమం
- ఉగాది రోజు నుంచి తొమ్మది రోజుల పాటు రామాయణం పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది
- తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను ఏడాదిలో ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తితో భవిష్యత్ ను ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు.
- ఉగాది రోజున దమనేన పూజ చేస్తారు.
- మొత్తానికి తెలుగు నూతన సంత్సరం రోజున ఉగాది స్పెషల్ గా వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.