AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఎంత సంపాదించిన శాంతి లేదా.. అయితే ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)  తన నీతి  శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన  విషయాలను..

Chanakya Niti: ఎంత సంపాదించిన శాంతి లేదా.. అయితే ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్న చాణక్య
Surya Kala
|

Updated on: Mar 30, 2022 | 11:10 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)  తన నీతి  శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన  విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ప్రస్తుతం రోజుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా మనిషి జీవిస్తున్నాడు. అయితే ఎంత డబ్బులు సంపాదించినా జీవితంలో  శాంతిని పొందలేకపోతున్నాడు. దీనికి కారణం అతనిలోని కొన్ని చెడు అలవాట్లు. ప్రశాంతమైన జీవితం కోసం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.  అవి ఏమిటో  ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఆచార్య చాణక్యుడు..  శాంతి పొందాలంటే మీలో ఆ శక్తి ఉందని తెలిపాడు. ఎవరైనా తమ జీవితాన్ని సమతుల్యంగా చీసుకుని నడుచుకున్నప్పుడే శాంతి దొరుకుతుందని నమ్మారు. పనులలో బాగా చేస్తారు. డబ్బు మీ అవసరాలను తీర్చగలదు. అయితే డబ్బు సుఖాన్ని ఇవ్వదు. అందుకే ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
  2. దురాశ: దురాశ మనిషి ఆనందాన్ని దూరం చేయడమే కాకుండా అతని ఆలోచనను చాలా సంకుచితంగా మారుస్తుందని ఆచార్య చెప్పేవారు. అత్యాశగల వ్యక్తి మొదట విశ్వాసాన్ని కోల్పోతాడు. అతను ఇతరుల పురోగతిని చూసి అసూయ చెందుతాడు. అప్పుడు అతనిలా లేదా అంతకంటే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో చాలాసార్లు తప్పుడు దారిలో పయనిస్తూ తనకు తానే కష్టాలను కోరి ఆహ్వానిస్తాడు. కనుక దురాశకు దూరంగా ఉండండి.
  3. కోపం: కోపంగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అలాంటి వారు చిన్న చిన్న విషయాలకే పరధ్యానంలో పడతారు. అటువంటి పరిస్థితిలో.. చాలాసార్లు తప్పు, ఒప్పు లను కూడా గుర్తించలేరు. కోపంతో ఉన్న వ్యక్తులు తమకు తాము మాత్రమే హాని చేసుకుంటారు. అందుకే జీవితంలో ప్రశాంతత కావాలంటే కోపానికి దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం ఉత్తమ మార్గం
  4. అహం: మీరు ఎంత సంపదను సంపాదించినా లేదా మీకు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నా, మీలో అహం వచ్చినట్లయితే.. అది మీ గౌరవంపై ప్రభావం చూపుతుంది. అహం చేరుకున్న వ్యక్తికీ గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. అహం ఉన్న వ్యక్తి తనకు తానే గొప్ప అనే భావం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఆ వ్యక్తి ఆనందానికి దూరమవుతాడు. ఇతరులను చిన్నవారిగా భావిస్తాడు. అలాంటి వారు అధఃపాతాళానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ఆచార్య చెప్పాడు.
  5. ఆరోగ్యం: ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలనుకుంటే, ముందుగా మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోండి. శరీరం అనారోగ్యానికి గురైతే.. మీకు ఇబ్బందిని ఇవ్వడమే కాకుండా.. మీ కలలను నెరవేర్చుకోవడానికి బ్రేక్ పడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం విజయానికి కీలకంగా పరిగణించబడుతుంది. అందువల్ల, జీవితం సంతోషంగా ఉండటానికి, మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

Also Read: Telangana: తాగివచ్చి స్కూల్‌లో నిద్రపోతున్న టీచర్.. అడిగినవారికి తలతిక్క సమాధానాలు

Vitamin E Oil: కళ్ళు చుట్టూ వలయాలు, ముఖంపై టాన్‌ను పోగొట్టడంలో విటమిన్-ఇ ఆయిల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా…!